బొంతపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 02:24 AM IST
బొంతపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

Updated On : April 17, 2019 / 2:24 AM IST

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి ఓ పరిశ్రమలోని సాల్వెంట్‌ యార్డులో మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో పరిశ్రమ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.