చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం : 300 కార్లు దగ్దం 

  • Published By: chvmurthy ,Published On : February 24, 2019 / 10:38 AM IST
చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం : 300 కార్లు దగ్దం 

Updated On : February 24, 2019 / 10:38 AM IST

చెన్నై: చెన్నైలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోరూర్ లోని ఓ కార్ల గోడౌన్ లో‌ ఈ సంఘటన జరిగింది. అగ్ని ప్రమాదంలో 300 కి పైగా కార్లు దగ్ధం అయ్యాయి. వీటిలో కొన్ని అధునాత కార్లు కూడా ఉన్నాయి. కొందరు వ్యక్తులు కూడా మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని అదుపులోకి  చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్ల తో ప్రయత్నిస్తున్నారు.  

శనివారం బెంగుళూరు ఎయిర్ షో వద్ద జరిగిన ప్రమాదం  మర్చిపోకముందే అదే తరహాలో ఆదివారం చెన్నైలో అగ్నిప్రమాదం జరగటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. యూటూ క్యాబ్ సంస్థ ఒక ఓపెన్ గౌడోన్లో కార్లను పార్క్ చేసింది. గోడౌన్ బయట ఎండలో కార్లను పార్క్ చేసి ఉంచారు.  కార్లు పార్కు చేసిన ప్రాంతంలో ఎండు గడ్డి అధికంగా ఉండటంతో, ఎవరైనా సిగరెట్ కాల్చి పారేశారా లేక వేరే కారణమేదైనా ఉందో తెలియాల్సి ఉంది.  గాలి ఎక్కువగా వీస్తుండటంతో మంటలు అదుపులోకి రాలేదు. కార్లలో ఉన్న డీజిల్, పెట్రోల్ వల్ల కూడా మంటలను అదుపు చేయటం కష్టంగా మారింది.