Ongole : ఒంగోలు యూనియన్ బ్యాంకులో కాల్పుల కలకలం.. తుపాకీతో కాల్చుకుని మృతి

Ongole : కాల్పుల శబ్దం వచ్చిన రూములోకి వెళ్లి చూడగా వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

Ongole : ఒంగోలు యూనియన్ బ్యాంకులో కాల్పుల కలకలం.. తుపాకీతో కాల్చుకుని మృతి

Ongole (Photo : Google)

Updated On : June 5, 2023 / 5:12 PM IST

Ongole – Union Bank : ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సెంటర్ లోని యూనియన్ బ్యాంకులో కాల్పుల మోత కలకలం రేపింది. సెక్యూరిటీ గార్డ్ ఎం.వెంకటేశ్వర్లు తుపాకీతో కాల్చుకుని మృతి చెందాడు. బ్యాంకులోని చెస్ట్ రూంలో వెంకటేశ్వర్లు తుపాకీతో కాల్చుకున్నాడు. కాల్పుల శబ్దం రావడంతో బ్యాంకులో పని చేసే సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక భయాందోళన చెందారు.

శబ్దం వచ్చిన రూములోకి వెళ్లి చూడగా వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు బ్యాంకు సిబ్బంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

Also Read..Vizianagaram : కూతురిని హీరోయిన్ చేయాలని, ఆ భాగాలు త్వరగా పెరగాలని హార్మోన్ ఇంజెక్షన్లు.. కసాయి తల్లి అరెస్ట్

చీమకుర్తికి చెందిన వెంకటేశ్వర్లు(35).. కొంత కాలంగా యూనియన్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఒంగోలు రామ్ నగర్ 8వ లైన్ లో భార్య ఉమామహేశ్వరితో కలిసి నివాసం ఉంటున్నాడు. పెళ్లై 7 సంవత్సరాలు అయినా అతడికి సంతానం లేదు. వెంకటేశ్వర్లు 2013 బ్యాచ్ కు చెందిన ఎస్పీఎఫ్ పోలీస్.

విషయం తెలిసిన వెంటనే డీజీఎం సవిత ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. మృతుడు వెంకటేశ్వర్లు నాలుగేళ్లుగా బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

Also Read..Hayat Nagar: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.. ఖాకీ సినిమా తరహాలో ఘటన