Gang Rape : జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు అరెస్ట్
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి ఇంతవరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఒకరిని అరెస్ట్ చేయగా ఈరోజు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలోఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు.

Jubliee Hills Gang Rape
Gang Rape : జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి ఇంతవరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఒకరిని అరెస్ట్ చేయగా ఈరోజు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలోఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు.
వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురు నిందితులను కర్ణాటక రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో సాజిద్ మాలిక్ తో పాటు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు(16)కూడా ఉన్నాడు. నిన్న బీజేపీ నాయకులు జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించటంతో ఈరోజు పోలీసు స్టేషన్ వద్ద భద్రత పెంచారు.
బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో నాలుగు బృందాలుగా ఏర్పడిన జూబ్లీ హిల్స్ పోలీసులు గడిచిన ఐదు రోజులుగా పోలీసులు గాలింపు చేపట్టి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు పూర్తిగా విచారణ జరిగితే మరికొన్ని అరెస్ట్ లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : Delhi : అంధురాలిపై అత్యాచారం చేసిన కామాంధుడు