ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 02:13 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

Updated On : May 1, 2019 / 2:13 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. కాలేజీలో పరీక్షలు అయిపోవడంతో విద్యార్థులంతా బొమ్మలరామారంలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌజ్ లో పార్టీ చేసుకున్నారు. పార్టీ ముగించుకుని కారులో హైదరాబాద్ కు వెళ్తున్నారు. మార్గంమధ్యలో బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామ శివారులో అదుపు తప్పి కారు పల్టీ కొట్టింది. దీంతో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుంగా ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్ కు తరలించారు.

మృతులు హైదరాబాద్ వాసులుగా తెలుస్తోంది. మృతుల్లో కొత్తపేటకు చెందిన వినీత్ రెడ్డి, స్ఫూర్తి, చాదర్ ఘాట్ కు చెందిన ప్రణీత, చంపాపేటకు చెందిన చైతన్యగా గుర్తించారు. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.