అరటి గెలలు కోస్తుండగా ఘోరం : విద్యుత్ షాక్‌తో 4గురు మృతి

శ్రీకాకుళం : జిల్లాలోని లావేరు మండలం కొత్త రౌతుపేటలో పెను విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అరటి గెలలు

  • Published By: veegamteam ,Published On : February 3, 2019 / 10:09 AM IST
అరటి గెలలు కోస్తుండగా ఘోరం : విద్యుత్ షాక్‌తో 4గురు మృతి

Updated On : February 3, 2019 / 10:09 AM IST

శ్రీకాకుళం : జిల్లాలోని లావేరు మండలం కొత్త రౌతుపేటలో పెను విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అరటి గెలలు

శ్రీకాకుళం : జిల్లాలోని లావేరు మండలం కొత్త రౌతుపేటలో పెను విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అరటి గెలలు కోస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను కొమ్మి వెంకన్న, రాములు, పుణ్యవతి, రౌతు బంగారమ్మగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

కొత్త రౌతుపేట గ్రామానికి సమీపంలోని తోటకు వెళ్లారు. అక్కడ అరటి గెలలు కోస్తున్నారు. ఇంతలో దారుణం జరిగింది. ఒకరిని రక్షించబోయి మరొకరు… ఇలా నలుగురు కరెంట్ షాక్‌తో మృతి చెందారు. మరికొద్ది రోజుల్లో పట్నం వెళ్లేందుకు వారంతా సిద్ధమయ్యారు. తమకున్న తోటను అమ్మేసి పట్నం వెళ్లాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే విధి వక్రీకరించింది. కరెంటు తీగలు కత్తికి తాకడంతో షాక్ కొట్టింది. ఆ వ్యక్తిని కాపాడబోయి మరొకరు వారిని కాపాడబోయి మరొకరు.. ఇలా నలుగురూ కరెంట్ షాక్‌తో చనిపోయారు.