గ్యాంగ్ వార్ : హైదరాబాద్ పాతబస్తీలో హత్య

గ్యాంగ్ వార్ : హైదరాబాద్ పాతబస్తీలో హత్య

Gang War Hyderabad Old City 2422

Updated On : May 14, 2021 / 12:23 PM IST

హైదరాబాద్ సిటీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి బాబా నగర్ లో హత్య జరిగింది. రాకేష్ కుమార్ (23), GHMCలో కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతను లాబ్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నాడు. 2019, జనవరి 30వ తేదీ బుధవారం తెల్ల‌వారుజామున బయటకు వచ్చాడు. తమ్ముడిని సాయిబాబా నగర్ లో డ్రాప్ చేయటానికి బైక్ పై బయలుదేరాడు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు వెంబడించారు. సాయిబాబా నగర్ దగ్గరకు వచ్చిన వెంటనే అడ్డుకున్నారు. రాకేష్ ను హాకీ స్టిక్స్ తో కొట్టి, కత్తి తో పొడిచి, రాళ్ళ తో తలపై కొట్టి చంపారు. బాధితుడు అక్క‌డిక్క‌డే చనిపోయాడు.

 

హత్య విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు.. స్పాట్ కు వచ్చారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. ద‌ర్యాప్తు కోసం ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. ఫలక్ నుమ ఏసీపీ మ‌హ‌మ‌ద్ అబ్దుల్ ర‌షీద్ ఘటన స్థ‌లానికి చేరుకుని పరిశీలించారు. త్వ‌ర‌లోనే నిందితుల‌ను పట్టుకుంటామని తెలిపారు. ఈ హత్య లో లంబడి రాజు అనే వ్యక్తి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు.