Ganja Batch : గంజాయి బ్యాచ్ వీరంగం-మత్తులో పోలీసు వాహనం ఎక్కి ధ్వంసం

హైదరాబాద్‌ లో నిన్న అర్థరాత్రి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. మెహిదీపట్నంలోని అసిఫ్‌నగర్‌, జిర్రా ప్రాంతంలోని రాయల్సీ హోటల్ దగ్గర గంజాయి మత్తులో యువకులు హల్‌చల్‌ చేశారు.

Ganja Batch : గంజాయి బ్యాచ్ వీరంగం-మత్తులో పోలీసు వాహనం ఎక్కి ధ్వంసం

Ganja batch

Updated On : June 14, 2022 / 11:33 AM IST

Ganja Batch :  హైదరాబాద్‌ లో నిన్న అర్థరాత్రి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. మెహిదీపట్నంలోని అసిఫ్‌నగర్‌, జిర్రా ప్రాంతంలోని రాయల్సీ హోటల్ దగ్గర గంజాయి మత్తులో యువకులు హల్‌చల్‌ చేశారు. నడిరోడ్డుపై వాహనదారులను అడ్డుకున్నారు. దీంతో వాహనదారలు  తీవ్ర ఇబ్బందురు ఎదుర్కోన్నారు. వెంటనే  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు అజయ్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.

ఐతే అప్పటికే గంజాయి మత్తులో ఉన్న యువకులు పోలీస్‌ వాహనం పైకి ఎక్కి నానా హంగామా చేశారు. పోలీసు వాహనంతో  పాటు ఇతర వాహనాల అద్దాలు పగులగొట్టారు. స్థానికుల సహాయంతో గంజాయి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో కొందరు తప్పించుకోగా..అజయ్‌ అనే యవకుడిని అసిఫ్‌నగర్‌ పోలీస్‌  స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : congress: ఏ నేరంపై విచార‌ణ జ‌రుపుతున్నార‌ని అడిగితే స‌మాధానం లేదు: చిదంబ‌రం