Viral Video : రోడ్లపై రీల్స్ చేస్తున్నారా? బీ కేర్‌ఫుల్.. ఎంత ఘోరం జరిగిందో చూడండి.. వీడియో వైరల్

ఓ మహిళ రీల్ చేస్తోంది. రోడ్డు పక్కన నడుస్తున్నట్లుగా రీల్ చేస్తోంది. ఆమె ఫ్రెండ్ ఫోన్ లో వీడియో తీస్తోంది.

Viral Video : రోడ్లపై రీల్స్ చేస్తున్నారా? బీ కేర్‌ఫుల్.. ఎంత ఘోరం జరిగిందో చూడండి.. వీడియో వైరల్

Viral Video : ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో షాక్ ఘటన చోటు చేసుకుంది. రీల్ చేస్తున్న మహిళకు ఓ చైన్ స్నాచర్ షాక్ ఇచ్చాడు. ఆమె మెడ నుంచి బంగాలు గొలుసు తెంపుకెళ్లాడు. రెప్పపాటులో బైక్ పై పారిపోయాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే దొంగ తప్పించుకున్నాడు. ఓ మహిళ రీల్ చేస్తోంది. రోడ్డు పక్కన నడుస్తున్నట్లుగా రీల్ చేస్తోంది. ఆమె ఫ్రెండ్ ఫోన్ లో వీడియో తీస్తోంది.

అయితే ఇంతలో బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి మహిళ మెడలోంచి చైన్ తెంపుకుని పారిపోయాడు. ఆ మహిళ తేరుకునేలోపే చైన్ స్నాచర్ ఎస్కేప్ అయ్యాడు. దీంతో రీల్ చేస్తున్న మహిళ, ఆమె స్నేహితురాలు ఇద్దరూ షాక్ కి గురయ్యారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, రీల్ చేస్తున్న సమయంలో చైన్ స్నాచర్ వచ్చి చైన్ తెంపుకెళ్లడం ఫోన్ లో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ షాకింగ్ ఘటన ఇందిరాపురంలో చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఓ మహిళ రోడ్డుపై రీల్ చేస్తుండగా.. సడెన్ గా ఓ బైకర్ ఆమె వద్దకు రావడం వీడియోలో చూడొచ్చు. ఆ బైకర్ అలా రావడంతో ఆ మహిళ కూడా కంగారుపడింది. ఇంతలోనే అతడు మెడలో నుంచి చైన్ తెంపుకెళ్లాడు. దీంతో అతడు చైన్ స్నాచర్ అని అర్థమైంది. ఇదంతా కూడా రెప్పపాటులో జరిగిపోయింది.

ఇటీవల రీల్స్ చేసే వాళ్లు ఎక్కువైపోయారు. ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేసుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఈ చైన్ స్నాచింగ్ ఘటనే నిదర్శనం. మనం ఎక్కడ ఉన్నాం? ఏం చేస్తున్నాం? చుట్టుపక్కల ఏం జరుగుతోంది? ఇలాంటివి కనిపెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే ఇదిగో ఇలానే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Also Read : రెడిమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటున్నారా? ప్రాణాలకు ఎంత ప్రమాదమో తెలుసా