Adulterated Ginger Garlic Paste : రెడిమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటున్నారా? ప్రాణాలకు ఎంత ప్రమాదమో తెలుసా

అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండటానికి హానికారక టైటానీయం డయాక్సైడ్, జాంతం గమ్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

Adulterated Ginger Garlic Paste : రెడిమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటున్నారా? ప్రాణాలకు ఎంత ప్రమాదమో తెలుసా

Adulterated Ginger Garlic Paste

Adulterated Ginger Garlic Paste : కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కాసుల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఆహార పదార్దాలను కల్తీ చేసి మార్కెట్ లో యధేచ్చగా విక్రయిస్తున్నారు. కల్తీ గురించి తెలియని ప్రజలు వాటిని కొని తిని అనారోగ్యాల బారిన పడుతున్నారు. తమ ప్రాణాలకే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరోసారి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టు రట్టు అయ్యింది.

సికింద్రాబాద్ లాలా పేట్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. అక్కడ అల్లం పేస్ట్ తయారీ ప్రక్రియ చూసి అధికారులే షాక్ అయ్యారు. అంత దారుణంగా కల్తీ చేస్తున్నారు. వాల్ పెయింటింగ్స్ లో వాడే కెమికల్స్ కలిపి జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేస్తున్నారు. కల్తీ అల్లం పేస్ట్ తయారీ గురించి పక్కా సమాచారంతో దాడులు చేశారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండటానికి హానికారక టైటానీయం డయాక్సైడ్, జాంతం గమ్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 1300 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్, 20 కేజీల టైటానియం డయాక్సైడ్, జాంతం గమ్ సీజ్ చేశారు పోలీసులు. సీజ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్, కెమికల్స్ విలువ లక్షా 70వేల రూపాయలు ఉంటుందన్నారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం నిర్వాహకుడు నీలా వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. కంపెనీ సీజ్ చేశారు. కాగా,
నిందితుడిపై గతంలో లాలా పేట్ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

ఈ రోజుల్లో అంతా రెడీమేడ్ ఫుడ్ పై ఆధారపడుతున్నారు. తినడానికి ఈజీ ఉంటుందని వాటిపై డిపెండ్ అవుతున్నారు. ఇదే అదనుగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆహార పదార్దాలను కల్తీ చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. బయట దొరికే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ధరకు వస్తోందని ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ కొంటే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Also Read : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. మీ గుండెకు మంచిది కాదట.. 8 గంటల గ్యాప్‌తో గుండెపోటు మరణాల ముప్పు!