పట్టాలు తప్పిన గూడ్స్ రైలు : పాక్షికంగా రైళ్లు రద్దు  

బొగ్గును తరలిస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సికింద్రాబాద్-వికారాబాద్ సెక్షన్ సమీపంలో చిటగిడ్డ సేష్టన్ దగ్గర బుధవారం గూడ్స్ రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.

  • Published By: sreehari ,Published On : April 10, 2019 / 07:25 AM IST
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు : పాక్షికంగా రైళ్లు రద్దు  

Updated On : April 10, 2019 / 7:25 AM IST

బొగ్గును తరలిస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సికింద్రాబాద్-వికారాబాద్ సెక్షన్ సమీపంలో చిటగిడ్డ సేష్టన్ దగ్గర బుధవారం గూడ్స్ రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.

హైదరాబాద్ : బొగ్గును తరలిస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సికింద్రాబాద్-వికారాబాద్ సెక్షన్ సమీపంలో చిటగిడ్డ సేష్టన్ దగ్గర బుధవారం గూడ్స్ రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. సౌత్ సెంట్రల్ రైల్వే (SCR)అధికారుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని పర్లి థెర్మల్ పవర్ ప్లాంట్ కు గూడ్స్ రైల్లో బొగ్గును తరలిస్తున్నట్టు చెప్పారు.
Read Also : చైతన్యం వచ్చింది : పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు

గూడ్స్ రైలు ప్రమాదం జరిగిన వెంటనే.. అప్రమత్తమైన అధికారులు తప్పిన బోగీల నుంచి బొగ్గును ఇతర బోగీల్లోకి తరలించినట్టు తెలిపారు. దెబ్బతిన్న పట్టాలపై రైల్వే వర్కర్లు మరమ్మత్తులు చేస్తున్నారని, మధ్యాహ్నం లేదా సాయంత్రానికి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఘటన జరిగిన వెంటనే.. సమాచారం తెలిసిన ఎస్ సీఆర్ జనరల్ మేనేజర్ గజనన్ మాల్యా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

ఈ ఘటన కారణంగా సికింద్రాబాద్-వికారాబాద్ సెక్షన్ నుంచి వెళ్లే మేజర్ ట్రైన్లు గంట ఆలస్యంగా నడుస్తున్నాయని, రైళ్ల సర్వీసులను రద్దు చేయలేదన్నారు. హైదరాబాద్, థాండూర్ మధ్య నడిచే ప్యాసెంజర్ రైలును బుధవారం రద్దు చేసినట్టు ఆయన చెప్పారు. ఇదే మార్గంలో నడిచే కొన్ని ట్రైన్లను పాక్షికంగా రద్దు చేసినట్టు తెలిపారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. మిగిలిన బోగీలతో గమ్యస్థానాన్ని చేరుకుంటుందని అధికారులు తెలిపారు. 
Read Also : మట్టిదిబ్బెలు పడి 10 మంది కూలీలు మృతి