అరిస్తే చంపేస్తామని బస్సు డ్రైవర్, కండక్టర్ అత్యాచారం

గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవరు, కండక్టర్లే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని పోర్‌బందర్ నగరంలో జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కుక్సీ పట్టణానికి చెందిన ఓ వివాహిత ఒంటరిగా పోర్‌బందర్ నగరానికి వచ్చేందుకు లగ్జరీ బస్సు ఎక్కింది. బస్సు ఛోటా ఉదయపూర్ పోలీసుస్టేషను పరిధిలోకి చేరుకునే సరికి రాత్రి 9 గంటలైంది. ప్రయాణికులు భోజనం చేసేందుకు బస్సుని ఆపారు.
కానీ ఓ ప్రయాణీకురాలు మాత్రం తనకు ఆకలిగా లేదని తానేమీ తిననీ బస్సులోనే ఉండిపోయింది. తనకు బాగా నిద్ర వస్తోందనీ బస్సులోనే పడుకుంటానని చెప్పింది. అది విన్న బస్ డ్రైవర్, కండక్టర్ ఆమె దగ్గరకు వచ్చి పడుకునేందుకు స్థలం చూపిస్తామంటూ బస్సు డ్రైవరు నన్నాభాయ్, కండక్టర్ కపిల్‌లు వివాహితను బస్సు పైకి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించగా ఆమె ప్రతిఘటించింది. దీంతో వారిద్దరూ ఎదురుతిరిగావంట బస్ పైనుంచి విసిరేస్తామని అలా విసిరిగి ఎముకలు విరిగి ఛస్తామని తాము చెప్పినట్లుగా వింటే ఏమీ చేయకుండా వదిలేస్తామని బెదిరించి ఇద్దరూ అత్యాచారం చేశారు.
అనంతరం బాధిత వివాహిత అదే బస్సులో పోర్‌బందర్ నగరానికి చేరింది. పోర్‌బందర్‌లో మేనల్లుడి ఈ విషయాన్ని చెప్పి..అతని సహాయంతో బాధిత మహిళ అత్యాచార ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బస్సు ఆపి డ్రైవరు నన్నాభాయ్, కండక్టర్ కపిల్ లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.