Gujarat : భార్య టార్చర్ తట్టుకోలేక జైలు కెళ్లేందుకు…

భార్య పెట్టే  మానసిక హింస తట్టుకోలేక... జైలు కెళ్తే ప్రశాంతంగా ఉండొచ్చు.. రెండు పూటలా భోజనం అయినా దొరుకుతుందని... కావాలని నేరం చేసి,  జైలు కెళ్లాడో భర్త.

Gujarat : భార్య టార్చర్ తట్టుకోలేక జైలు కెళ్లేందుకు…

Man Fedup With Wife

Updated On : August 30, 2021 / 3:21 PM IST

Fed Up With Wife”s Behaviour : భార్య పెట్టే  మానసిక హింస తట్టుకోలేక… జైలు కెళ్తే ప్రశాంతంగా ఉండొచ్చు.. రెండు పూటలా భోజనం అయినా దొరుకుతుందని… కావాలని నేరం చేసి,  జైలు కెళ్లాడో భర్త.  గుజరాత్, రాజ్‌కోట్‌లోని జామ్‌నగర్ రోడ్డులోని బజరంగ్ వాడికి చెందిన దేవ్‌జీ చావడా  (23) దినసరి కూలీగా పని చేస్తూ ఉంటాడు. అతని భార్య అయిన దానికి, కాని దానికి  ఇతనికి లెక్చర్లు ఇస్తూ ఉండేది. అతడ్ని కించపరుస్తూ మాట్లాడేది.

భార్య ప్రవర్తనతో విసుగెత్తిన దేవ్‌జీ భార్యను ఏమీ అనలేక తనలో తానే మధనపడసాగాడు.  ఎవరికీ తన కష్టం చెప్పుకోలేక పోయాడు. అతనిలో కోపం పెరిగి పోసాగింది. తన భార్య నుంచి దూరంగా వెళ్తే ప్రశాంతంగా బతకొచ్చు అని నిర్ణయించుకున్నాడు.  నిన్న సాయంత్రం తన ఇంటి ఎదురుగా ఉన్న పోలీసు ఔట్ పోస్ట్‌పై  పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

మంటలను గుర్తించిన స్ధానికులు అక్కడు వెళ్ళి మంటలను అదుపులోకి తెచ్చారు. స్ధానికులు మంటలను ఆర్పుతుంటే అలా చూస్తూ ఉన్నాడే తప్ప అక్కడి నుంచి కదల్లేదు. పోలీసులకు సమాచారం  తెలిసి  ఘటనా స్ధలానికి చేరుకున్నారు.  స్ధానికులు ఇచ్చిన సమాచారంతో  పోలీసులు దేవ్‌జీ ని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

భార్య ప్రవర్తనతో విసిగిపోయి ఉన్నానని…ప్రశాంతంగా ఉండటానికి జైలుకు వెళ్లేందుకే పోలీసు ఔట్ పోస్టు‌కు నిప్పంటించినట్లు తెలిపాడు. ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోవటంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులునిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.