హయత్ నగర్‌ మర్డర్ అప్ డేట్ : నిలదీయడంతో కీర్తి నిజం చెప్పింది – తండ్రి

  • Published By: madhu ,Published On : October 28, 2019 / 09:19 AM IST
హయత్ నగర్‌ మర్డర్ అప్ డేట్ : నిలదీయడంతో కీర్తి నిజం చెప్పింది – తండ్రి

Updated On : October 28, 2019 / 9:19 AM IST

హయత్ నగర్‌లో జరిగిన మర్డర్ కేసు కలకలం రేపుతోంది. ప్రేమ మైకంలో మునిగిపోయిన ఆ కూతురు పేగు బంధాన్ని కూడా కాదనుంది. కన్నతల్లి అని కూడా చూడకుండా కర్కశంగా కడతేర్చింది. పల్లెర్ల కీర్తిరెడ్డి అనే యువతి..తల్లి రజితను హత్య చేసింది. ప్రేమకు అడ్డుగా వస్తుందన్న కోపంతోనే తల్లిని హత్య చేసిందని పోలీసులు చెబుతున్నారు. తండ్రి ఆమెను నిలదీయడంతోనే నిర్వాకం బయటపడినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కీర్తి తండ్రి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. 

డ్యూటి ముగించుకుని ఇంటికి వచ్చేలోపు తన భార్య రజిత, కూతురు కనిపించలేదన్నారు. ఎక్కడున్నావ్ అని అడిగితే..వైజాగ్ వెళ్లానని చెప్పిందని, భార్య గురించి అడిగితే తెలియదని చెప్పిందన్నారు. కీర్తి మాటలతో అనుమానం వచ్చి ఎవరితో వైజాగ్ వెళ్లావని నిలదీసినట్లు చెప్పారు. నేను కొట్టడంతోనే ఎటో వెళ్లిపోయిందని పేర్కొంటూ..పోలీసులకు తనపైనే కీర్తి ఫిర్యాదు చేసిందన్నారు. బంధువులతో కలిసి కీర్తిని నిలదీయడంతో…ప్రియుడితో కలిసి తల్లిని చంపినట్లు ఒప్పుకుందన్నారు. 

పల్లెర్ల కీర్తిరెడ్డి అనే యువతి… హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మునగనూరులో నివాసముంటోంది. ఈమె తండ్రి లారీ డ్రైవర్. కూతురు భవిష్యత్ బంగారుమయం చేయాలనుకున్న ఆ తండ్రి… అందుకోసం ఉన్న ఊరును వదిలి ఉపాధికోసం వలసవచ్చాడు. రామన్నపేట నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. అందరిలాగే తమ కూతురుకు ఘనంగా పెళ్లిచేయాలని ఆశపడ్డాడు. ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం నడిపిన కీర్తి.. తండ్రి డ్యూటీకి వెళ్లిన సమయంలో ఘాతుకానికి పాల్పడింది. ప్రేమ వ్యవహారం వద్దన్నందుకు ప్రియుడితో కలిసి తల్లి రజితను చంపేసింది.

అంతేకాదు… తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ప్రియుడితో కలిసి మూడు రోజుల పాటు అదే ఇంట్లో గడిపింది.దుర్వాసన రావడంతో అదే ప్రియుడి సహయంతో స్వగ్రామం రామన్నపేట సమీపంలో రైలు పట్టాలపై తల్లి డెడ్‌బాడీని పడేసింది. ఆ తర్వాత తన తల్లి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు…నేరం బయటపడడంతో పోలీసులు నిందితురాలు కీర్తితో పాటు, ఆమె మొదటి ప్రియుడు శశిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
Read More : ఇలాంటి కూతురు వద్దు : తల్లిని ప్రియుడితో కలిసి చంపి.. 3 రోజులు ఇంట్లోనే..