Bank Employee : యూపీలో విషాదం.. అనుమానాస్పదంగా బ్యాంకు ఉద్యోగిని మృతి.. తీవ్ర పని ఒత్తిడే కారణమా?
HDFC Bank Employee : ఫాతిమాకు ఇటీవల బ్యాంకులో అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆ పని ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో టెన్షన్ పెరిగి గుండెపోటు వచ్చి ఉండొచ్చునని తోటి ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

HDFC Employee, 45, Dies In Office, Cops Probe _Suspicious Circumstances_
HDFC Bank Employee : యూపీలోని లక్నోలో విషాదం చోటుచేసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన సదాఫ్ ఫాతిమా అనే ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బ్యాంకులో పనిచేస్తున్న చోటే ఆమె కుప్పకూలింది. అనంతరం ఫాతిమా ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఆ బ్యాంకు ఉద్యోగిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిక పనిఒత్తిడి కారణంగా గుండెపోటుతో మరణించిన అన్నా సెబాస్టియన్ ఉదంతం నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also : Game Changer : రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి సాలీడ్ అప్‌డేట్.. రెండో సాంగ్ పోస్టర్ చూశారా?
నివేదికల ప్రకారం.. 45 ఏళ్ల ఉద్యోగిని ఉన్నట్టుండి పనిచేస్తున్న కుర్చీపై నుంచి కిందపడిపోయింది. బ్యాంకు ఉద్యోగిని సదాఫ్ తీవ్ర పని ఒత్తిడికి గురైందని ఆమె తోటి ఉద్యోగులు పేర్కొన్నారు. ఫాతిమా అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్గా బ్యాంకులో విధులు నిర్వర్తిస్తోంది. ఎప్పటిలానే ఉద్యోగ నిమిత్తం బ్యాంకుకు వెళ్లింది.
కానీ, కొద్దిసేపటి తర్వాత కూర్చొన్న కుర్చీలోనే కుప్పకూలింది. వెంటనే గమనించిన అక్కడి బ్యాంకు సిబ్బంది ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సదాఫ్ ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు వెల్లడించారు. ఫాతిమాకు ఇటీవల బ్యాంకులో అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆ పని ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో టెన్షన్ పెరిగి గుండెపోటు వచ్చి ఉండొచ్చునని తోటి ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
“విభూతిఖండ్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదనపు డిప్యూటీ విపి, సదాఫ్ ఫాతిమా పనిచేస్తూ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మార్చూరికి తరలించాం. ఆమె మరణానికి కారణం పోస్టుమార్టం తర్వాతే స్పష్టత వస్తుంది’’ అని విభూతిఖండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధారామన్ సింగ్ వెల్లడించారు.
लखनऊ में काम के दबाव और तनाव के कारण एचडीएफ़सी की एक महिलाकर्मी की ऑफिस में ही, कुर्सी से गिरकर, मृत्यु का समाचार बेहद चिंतनीय है।
ऐसे समाचार देश में वर्तमान अर्थव्यवस्था के दबाव के प्रतीक हैं। इस संदर्भ में सभी कंपनियों और सरकारी विभागों तक को गंभीरता से सोचना होगा। ये देश के… pic.twitter.com/Xj49E01MSs
— Akhilesh Yadav (@yadavakhilesh) September 24, 2024
ఈ సంఘటనపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటన “అత్యంత ఆందోళనకరం”గా పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత ఆర్థిక ఒత్తిడికి ప్రతిబింబంగా ఆయన పేర్కొన్నారు. కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు తమ ప్రాధాన్యతలతో పాటు పని పరిస్థితులను పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
“ఈ విషయంలో అన్ని కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు తీవ్రంగా ఆలోచించాలి. దేశ మానవ వనరులకు తీరని నష్టం. ఇలాంటి ఆకస్మిక మరణాలు పని పరిస్థితులను ప్రశ్నార్థకం చేస్తాయి” అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.
Read Also : Donald Trump : నా హత్యకు ఇరాన్ కుట్ర చేస్తోంది.. యూఎస్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలపై ట్రంప్ కామెంట్స్..!