మార్కెట్ యార్డులో భారీ అగ్నిప్రమాదం : 9 మామిడి మండీలు అగ్నికి ఆహుతి

చిత్తూరు జిల్లా పాకాల మండలం దామల చెరువు మార్కెట్ యార్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మామిడి మండీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తొమ్మిది మామిడి గోదాముల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో గంటన్నరపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా బెంగళూరు, చెన్నై నుంచి వ్యాపారులు వస్తుంటారు. 25 మంది రైతులకు సంబంధించిన మామిడి కాయలు, పళ్లు దహనం అయ్యాయి. రైతులు లబోదిబోమంటున్నారు.