Manipur : మహిళలను నగ్నంగా ఊరేగించిన వ్యక్తి ఇంటికి నిప్పు

మణిపూర్ రాష్ట్రంలో శుక్రవారం మళ్లీ హింసాకాండ చెలరేగింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ప్రధాన నిందితుడి ఇంటికి కొందరు ఆగంతకులు నిప్పు పెట్టారు. వైరల్ అయిన వీడియోలో మరో కమ్యూనిటీకి చెందిన ఇద్దరు నగ్న మహిళలను చూసిన ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది....

Manipur : మహిళలను నగ్నంగా ఊరేగించిన వ్యక్తి ఇంటికి నిప్పు

Manipur House set on fire

Updated On : July 21, 2023 / 9:01 AM IST

Manipur : మణిపూర్ రాష్ట్రంలో శుక్రవారం మళ్లీ హింసాకాండ చెలరేగింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ప్రధాన నిందితుడి ఇంటికి కొందరు ఆగంతకులు నిప్పు పెట్టారు. (set on fire) వైరల్ అయిన వీడియోలో మరో కమ్యూనిటీకి చెందిన ఇద్దరు నగ్న మహిళలను చూసిన ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అయిన రెండు రోజుల తర్వాత, ప్రధాన నిందితుడి ఇంటిని శుక్రవారం దుండగులు తగులబెట్టారు. ( House of man)

Manipur Women Viral Video : నాటి షాకింగ్ ఘటన గురించి బాధిత మణిపూర్ మహిళ ఏం చెప్పారంటే…

మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో పోరాడుతున్న ఒక వర్గానికి చెందిన మహిళలను అవతలి వైపు నుంచి వచ్చిన గుంపు నగ్నంగా ఊరేగించినట్లు వీడియో చూపించింది. (paraded Manipur women naked) ఈ ఘటన ఇంటర్నెట్ నిషేధం ఎత్తివేసిన తర్వాత వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, ఈ వీడియో దేశవ్యాప్తంగా దుమారం రేపింది.

Human Rights Commission : మణిపూర్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ నోటీస్

మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై మణిపూర్‌కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ వీడియోను సుమోటోగా తీసుకున్న మణిపూర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై తౌబాల్ జిల్లాలోని నాంగ్‌పోక్ సెక్మై పోలీస్ స్టేషన్‌లో అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసును నమోదు చేశారు.

Earthquake : మణిపూర్, జైపూర్‌లో భూకంపం..భయాందోళనల్లో జనం

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, నిందితులకు ఉరిశిక్షతో సహా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ గురువారం తెలిపారు.