Human Rights Commission : మణిపూర్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ నోటీస్

మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ దారుణ ఘటనపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ ఈశాన్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు హెచ్ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది....

Human Rights Commission : మణిపూర్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ నోటీస్

HRC issues notice

Human Rights Commission : మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మణిపూర్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర పోలీసు చీఫ్‌కు నోటీసులు జారీ చేసింది. ‘‘ఇలాంటి అనాగరిక సంఘటనల నుంచి పౌరులు, ముఖ్యంగా మహిళలు, సమాజంలోని బలహీన వర్గాల మానవ హక్కులను కాపాడటానికి తీసుకున్న చర్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం’’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (National Human Rights Commission) ఒక ప్రకటనలో పేర్కొంది.

Parliament monsoon session: మణిపూర్‌ హింసపై చర్చించాలని విపక్షాల పట్టు.. అవును చర్చ జరగనివ్వాలని ఇలా బీజేపీ కౌంటర్లు

మే 4వతేదీన మణిపూర్ రాష్ట్రంలోని కాంగ్ పోక్పి జిల్లా బి ఫైనోమ్ గ్రామంలో ఒక గిరిజన కుటుంబానికి చెందిన ఐదుగురిని పోలీసు కస్టడీ నుంచి తీసుకువెళ్లిన ఘటనపై తక్షణం జోక్యం కల్పించుకోవాలని హెచ్ఆర్‌సీ కోరింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, (women being paraded naked) వారిలో ఒకరిపై సామూహిక అత్యాచారం చేసి, ఆ కుటుంబంలోని ఇద్దరు పురుషులను హత్య చేశారని మానవ హక్కుల కమిషన్ పేర్కొంది.

Manipur Violence: మణిపూర్‌లో ఇంత జరుగుతున్నా రాష్ట్రపతి పాలన ఎందుకు విధించడం లేదు?

మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో పోరాడుతున్న ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు దుండగులు నగ్నంగా ఊరేగిస్తున్నట్లు చూపుతున్న వీడియో బుధవారం ఆన్‌లైన్‌లో కనిపించడంతో మణిపూర్ కొండల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ దారుణ ఘటనపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ ఈశాన్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు హెచ్ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. (Human Rights Commission issues notice)

MANIPUR: ఈ ఒకే ఒక్క వదంతి వల్ల.. ఆ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు.. ఇప్పుడు యావత్ భారత్ రగిలిపోతోంది..

ఈ దారుణ ఘటనపై కేసు దర్యాప్తు స్థితి, బాధిత మహిళల ఆరోగ్యస్థితి, బాధితుల కుటుంబాలకు అందజేసిన నష్టపరిహారం వివరాలను నివేదికలో పొందుపర్చాలని హెచ్ఆర్‌సీ కోరింది. కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా పరేడ్ చేయించి, వారిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మిజోరాంలోని అత్యున్నత మహిళా సంస్థ మిజో హ్మీచే ఇన్సుయిహ్‌ఖామ్ పాల్ (Mizo Hmeichhe Insuihkhawm Pawl) గురువారం జాతీయ మానవహక్కుల కమిషన్ కు లేఖ రాసింది.