Husband killed wife : ఫోన్ ఎంగేజ్ వస్తోందని భార్యపై అనుమానం…హత్య

టైలరింగ్ చేసే భార్య ఫోన్ ఎప్పడూ ఎంగేజ్ వస్తూ ఉండటంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడో భర్త. అనుమానం పెనుభూతమై సైకోలా మారి ఆమెను కడతేర్చాడు.

Husband killed wife : ఫోన్ ఎంగేజ్ వస్తోందని భార్యపై అనుమానం…హత్య

Husband Killed Wife

Updated On : May 20, 2021 / 5:28 PM IST

Husband killed wife : టైలరింగ్ చేసే భార్య ఫోన్ ఎప్పడూ ఎంగేజ్ వస్తూ ఉండటంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడో భర్త. అనుమానం పెనుభూతమై సైకోలా మారి ఆమెను కడతేర్చాడు. తమిళనాడులోని కన్యాకుమారిజిల్లా వెల్లిచందైకి చెందిన రమేష్ (42)  ద్విచక్రవాహానాల సీట్ కవర్లు తయారు చేస్తూ ఉంటాడు. అతని భార్య ఉమా కూడా టైలరింగ్ నేర్చుకుంది. ఇంట్లోనే బట్టలు కుడుతూ ఉంటుంది. వారికి 11 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు.

కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా బట్టలు కుట్టటంతో ఉమ టైలరింగ్ లో బిజీ అయ్యింది. కస్టమర్లతో మాట్లడటం…. వారితో వాట్సప్ ద్వారా వారికి నచ్చిన డిజైన్ లు పంపించి.. వారి అనుమతి తీసుకోవటం…. వారికి కావల్సిన డిజైన్ల కోసం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూ ఉండటంతో ఆమెకు క్షణం తీరిక లేకుండా ఉండసాగింది.

రమేష్ షాపు కు వెళ్లి, ఇంట్లో   ఉన్న ఉమతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడల్లా ఆమె ఫోన్ ఎంగేజ్ వస్తూ…”మీరు మాట్లాడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి వేరే కాల్ లో బిజీగా ఉన్నారు  కాసేపాగి ప్రయత్నించండి”  అనే ఆటోమేటిక్ సర్వర్ మెసేజ్ వినిపిస్తూ ఉండేది. ఈ మాటతో రమేష్ కు భార్యపై అనుమానం పెరిగింది.

ఉమ వేరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం అతనిలో క్రమంగా పెరగసాగింది.  బట్టలు కుట్టించుకునే వాళ్లు ఇంటికి వచ్చి వెళుతూ ఉండటం… వారితో పాటు మగవారు కూడా రావటం అతని అనుమానాన్ని మరింత బలపరిచింది.  దీంతో అతను ఉమను వేధించసాగాడు.

ఈ విషయం తెలిసిన ఉమ తల్లి తండ్రులు వారి స్వగ్రామం నుంచి వచ్చి కూతురు ఉంటున్న గ్రామంలోనే నివాసం ఉండసాగారు. అల్లుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కూతురుకు రక్షణగా ఉంటున్నారు. అయినా రమేష్ కు భార్యపై అనుమానం పోలేదు. స్మార్ట్ ఫోన్ ఎప్పడూ ఎంగేజ్ రావటం అతనిలోని అనుమానం పెరగసాగింది. రాన్రాను అతని మానసిక పరిస్ధితి దిగజార సాగింది. సైకోలా మారిపోయాడు.

ఒకనొక సమయంలో ఇంటికి పాలు తెచ్చే వారితో సహా అందరిపై అనుమానం పెంచుకున్న రమేష్ చివరికి భార్యను ఇంట్లో తాళం పెట్టి బయటకు వెళ్లే పరిస్ధితికి వచ్చాడు. భర్త ప్రవర్తనతో విసిగెత్తి పోయిన ఉమ నాలుగు నెలల క్రితం భర్తను విడిచి పిల్లల్ని తీసుకుని … గ్రామంలోనే ఉన్నతల్లితండ్రుల వద్దకు వెళ్లిపోయింది.

రమేష్ నెల రోజుల క్రితం గ్రామస్తుల ద్వారా మధ్యవర్తిత్వం చేయించి మళ్లీ భార్యను ఇంటికి పిలిపించుకున్నాడు.  అప్పటి నుంచి భార్యతో ప్రేమగా ఉండసాగాడు. ఈక్రమంలో మే 16వ తేదీ రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో భార్యను గొంతుకోసి హత్య చేశాడు. అలికిడికి   పిల్లలు లేచి చూడటంతో వెంటనే  బైక్ వేసుకుని పరారయ్యాడు.

పిల్లలు ఇరుగు పొరుగువారికి సమాచారం ఇవ్వటంతోవారు వచ్చి అంబులెన్స్ లో ఉమను అసరిపల్లం మెడికల్ కాలేజీకి తరలించారు.  కాగా… అప్పటికే ఉమ చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న సిల్వర్ మార్కెట్ పోలీసు స్టేషన్ పోలీసులు  పిల్లలను ఇరుగు పొరుగు వారిని విచారించారు.

పిల్లలు తల్లి ఫోన్ ఎంగేజ్ గా ఉండటం .. తండ్రి గొడవపడటం అన్నీ పూసగుచ్చినట్లు వివరించారు. భార్య ఫోన్ ఎంగేజ్ రావటం.. ఫోన్ లో,  మరోకరితో మాట్లాడుతున్నారు అని చెప్పే సర్వర్ వాయిస్ విని .. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని సైకోలా మారిన వ్యక్తి భార్యను గొంతుకోసి చంపటంతో ఆ ప్రాంత  ప్రజలు విస్మయానికి గురయ్యారు.