Gold Theft : రెండు కేజీల బంగారు ఆభరణాల చోరీ కేసు చేధించిన పోలీసులు

హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు కేజీల బంగారు ఆభరణాల బ్యాగు చోరీ కేసును పోలీసులు చేదించారు.

Gold Theft : రెండు కేజీల బంగారు ఆభరణాల చోరీ కేసు చేధించిన పోలీసులు

Gold Theft Case

Updated On : September 3, 2021 / 9:38 PM IST

Gold Theft : హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు కేజీల బంగారు ఆభరణాల బ్యాగు చోరీ కేసును పోలీసులు చేదించారు. ముంబై నగల వ్యాపారి వద్ద పని చేసే గులాబ్ మాలి,ప్రవీన్ కుమార్ లు చోరీ చేసినట్లు తేల్చారు.  నిందితుల నుంచి కోటి రూపాయల విలువ చేసే రెండు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

రాజస్తాన్‌కు చెందిన గులాబ్ మాలి గత పది సంవత్సరాలుగా ముంబైలోని రనుజా జ్యువెల్లరీ లో సెల్స్ మెన్ గా పని చేస్తున్నాడు. రనుజా జ్యువెల్లరీ షాప్ ఓనర్ శ్రవణ్ కుమార్‌కు నమ్మకస్తుడిగా మారాడు. నగల వ్యాపారి హైదరాబాద్ లో పలు జ్యువెల్లరీ షాపులకు 7సంవత్సరాలుగా బంగారు ఆభరణాలు సరఫరా చేస్తున్నాడు. గులాబ్ మాలి జాల్సా లైఫ్ కు అలవాటు పడ్డాడు. ఎం.సి.ఎక్స్. గోల్డ్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టి గులాబ్ మాలి బాగా నష్టపోయారు.  దీంతో ఓనర్ దగ్గర గోల్డ్ కోట్టేయాలని తన స్నేహితుడు ప్రవీణ్ కుమార్‌తో  కలిసి ప్లాన్ చేశాడు.

హైదరాబాద్ లోని అమీర్ పేట్ ,అబిడ్స్, చార్మినార్,సికింద్రాబాద్ ఏరియాల్లో 2కిలోల 122 గ్రాముల గోల్డ్ చైన్స్, బ్రాస్ లెట్స్ షాపుల్లో మార్కెటింగ్ చేయడానికి, అగస్ట్ 23న ముంబై నుంచి హైదరాబాద్ కు జబ్బార్ ట్రావెల్స్ లో తనకు, తన మేనల్లుడు ముఖేష్ పరిహార్ కు టికెట్ బుక్ చేశాడు.

తన ప్రెండ్స్‌ను పూణే నుంచి హైదరాబాద్ కు… అదే జబ్బార్ ట్రావెల్స్ లో టికెట్ బుక్ చేసేలా ప్లాన్ చేశాడు. మాలి తన సేఫ్ జాకెట్ లో దాచిన గోల్డ్ అర్నమెంట్స్ ప్రవీన్ కుమార్ ఇచ్చాడు. ఉదయం అమీర్ పేట్ కు రాగానే గోల్డ్ బ్యాగ్ చోరీకి గురైంది అంటూ ఓనర్ కు చెప్పాడు. దీంతో మొదట బంగారంతో వున్న బ్యాగు మిస్ అయిందని శ్రవణ్ కుమార్ సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో ఆగస్టు 26న ఫిర్యాదు చేశారు.

జీరో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పరిధిలో చోరీ జరగడంతో కేసు అక్కడకు బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు నాలుగు టీంలతో దర్యాప్తు మొదలెట్టారు. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించి, ముంబయి లోని సీసీ కెమెరాలు పరిశీలించారు. దీంతో నగల వ్యాపారి దగ్గర పని చేసే సిబ్బంది ఇద్దరు ఈ బ్యాగు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు.

శ్రావణ్ కుమార్ వద్ద నుంచి దొంగతనం చేసిన బంగారు ఆభరణాల్లో 69  గ్రాములు ఐసిఐసి బ్యాంక్ లో తాకట్టు పెట్టి 2లక్షల 6వేల రూపాయలు తీసుకోని వాడుకున్నాడు. మొత్తానికి నిందితుల నుంచి కోటి రూపాయల విలువ చేసే 2కిలోల 52గ్రాముల బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.