హైదరాబాద్ Drugs కేసు : ఆ 300 మంది ఎవరు ? టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారా ? 

  • Published By: madhu ,Published On : June 5, 2020 / 07:04 AM IST
హైదరాబాద్ Drugs కేసు : ఆ 300 మంది ఎవరు ? టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారా ? 

Updated On : June 5, 2020 / 7:04 AM IST

పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన ఆ కొత్త నిజాలేంటి..? ఎక్సైజ్‌ శాఖ నిఘాలో ఉన్న ఆ 300 మంది ఎవరు…? టాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు కూడా పోలీసుల లిస్ట్‌లో ఉన్నాయా…? డ్రగ్స్‌ డీలర్ల ఫోన్‌ డాటాలో ఎవరి నంబర్లున్నాయి…? వాట్సప్‌ చాటింగ్ బయటకొస్తే ఎవరి కొంప మునుగుతుంది..? 

సంచలన నిజాలు : –
హైదరాబాద్‌లో పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లాక్‌డౌన్ సడలింపులతో మళ్లీ పలువురు ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా నగరంలో డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలు పెరిగినట్లుగా గుర్తించిన పోలీసులు…గతంలో డ్రగ్స్ విక్రయాలు జరిపిన 300 మంది కదలికలపై నిఘా పెట్టారు అధికారులు. డ్రగ్స్ తీసుకున్న ఆ 300ల మందిలో సినీ ప్రముఖులతో పాటుగా వ్యాపారవేత్తలు, విద్యార్థులు పేర్లు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అలాగే మరికొందరు ప్రముఖులు బెంగుళూరుకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు.

పోలీసులకు చిక్కకుండా : –
తాజాగా పట్టుబడ్డ…పరంజ్యోతి సింగ్, అమిత్ కుమార్‌లను విచారించగా..ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ముఠా సభ్యులు…సాంకేతిక పరంగా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానంగా వాట్సాప్, టెలిగ్రామ్‌లో చేసిన చాటింగ్‌లను ఎప్పటికప్పుడు డిలీట్ చేశారు. దీంతో పాటుగా కాల్ లిస్ట్‌ను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. ముఠా సభ్యుల ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు…వాట్సాప్, టెలిగ్రామ్‌లో చాటింగ్‌ను చూసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు.

వాట్సాప్ చాటింగ్ బయటకు వస్తే : –
అయితే అన్నీ డిలీట్ చేయడంతో… టెక్నికల్ సపోర్టింగ్ కోసం పోలీసు అధికారులను ఆశ్రయించారు. వీలైనంత తొందరగా వాట్సాప్, టెలిగ్రామ్‌తో పాటు కాల్‌ లిస్ట్‌ను ఇవ్వాలని కోరారు. వాట్సాప్ చాటింగ్ బయటకు వస్తే మరికొంతమంది ప్రముఖుల బండారం బయటపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు, విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఆ ప్రముఖులు ఎవరు ? : –
అయితే డ్రగ్స్‌ తీసుకుంటున్న ప్రముఖులు ఎవరు…? ఎక్సైజ్‌ శాఖ నిఘాలో ఉన్న 300 మంది ఎవరు…? టాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు కూడా అందులో ఉన్నాయా…? డ్రగ్స్‌ డీలర్ల ఫోన్‌ డాటాలో ఎవరి నంబర్లున్నాయి…? వాట్సప్‌ చాటింగ్ బయటకొస్తే ఎవరి కొంప మునుగుతుంది..? బెంగళూరు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసింది ఎవరు…? ఇప్పటి వరకు ఎంత వ్యాపారం జరిగింది..? మాస్క్‌ల ముసుగులో కాకుండా ఇంకెలా తీసుకువస్తున్నారు..? హైదరాబాద్‌లో వ్యాపారాన్ని నడిపిస్తుందెవరు..? అసలు డ్రగ్స్ మూలాలు ఎక్కడున్నాయి..? వీటికి సంబధించి పూర్తి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు అధికారులు.

గతంలో హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. పలువురు సినీ ప్రముఖులను అధికారులు విచారించారు. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడం సంచలనం సృష్టిస్తోంది. ఇది ఎవరికి చుట్టుకుంటుందో అనే భయాందోళనలు పలువురిలో చోటు చేసుకున్నాయి.

Read: మహానగరంలో మత్తు మాఫియా : మాస్క్ ల ముసుగులో డ్రగ్స్ దందా