IPL Tickets : నకిలీ ఐపీఎల్ టికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు, ఆరుగురు అరెస్ట్

IPL Tickets: హైదరాబాద్-ముంబై ఐపీఎల్ మ్యాచ్ కి 200 నకిలీ టిక్కెట్స్ తయారు చేసి క్రికెట్ అభిమానులకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

IPL Tickets : నకిలీ ఐపీఎల్ టికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు, ఆరుగురు అరెస్ట్

IPL Tickets(Photo : Google)

Updated On : April 27, 2023 / 9:11 PM IST

IPL Tickets : కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. దేన్నీ వదలడం లేదు. అన్నింటిని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి దానికి నకిలీలు తయారు చేసి కాసులు దండుకుంటున్నారు. తాజాగా కొందరు అక్రమార్కుల కన్ను ఐపీఎల్ టికెట్ల మీద పడుంది. అసలే ఐపీఎల్ క్రికెట్ కు ఫుల్ క్రేజ్ ఉంది. మ్యాచ్ ను స్టేడింయలో లైవ్ లో చూసేందుకు ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఐపీఎల్ టికెట్ల కోసం పోటీపడుతున్నారు. సరిగ్గా.. ఫ్యాన్స్ కున్న ఈ వీక్ నెస్ ని కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ ఐపీఎల్ టికెట్లు ముద్రించి అమ్ముకుంటున్నారు.

నకిలీ ఐపీఎల్ టికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నకిలీ ఐపీఎల్ టికెట్లు తయారు చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరిని రిమాండ్ కు తరలించారు. ఏపోని ఈవెంట్స్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ వెండర్ ఏజెన్సీలో సబ్ కాంట్రాక్టర్ కోమట్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి పని చేస్తున్నాడు.

Also Read..Kidney Racket : విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. రూ.8,50,000 ఇస్తామంటూ కిడ్నీ తీసుకుని మోసం

గోవర్ధన్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్ లకు అఖిల్ అహ్మద్, పెగ్గిది మృదుల్ వంశీ, మహమ్మద్ ఫాహీం , శ్రావణ్ కుమార్, మహమ్మద్ అజార్ లను వ్యాలిడేటర్లుగా నియమించుకున్నాడు. వీరికి జారీ చేసిన అక్రెడిటేషన్ కార్డులోని బార్ కోడ్ ని కాపీ చేసి నకిలీ టిక్కెట్లను తయారు చేసి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్-ముంబై ఐపీఎల్ మ్యాచ్ కి 200 నకిలీ టిక్కెట్స్ తయారు చేసి క్రికెట్ అభిమానులకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

దీనిపై నిఘా పెట్టిన పోలీసులు ఈ దందాను పసికట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 68 ఐపీఎల్ టికెట్లు, 3 ఐపీఎల్ అక్రెడిటేషన్ కార్డులు, 3 సెల్ ఫోన్లు, ఒక సీపీయూ, హార్డ్ డిస్క్, మానిటర్ స్వాధీనం చేసుకున్నారు. వారి రిమాండ్ కి తరలించారు.