Hyderabad Police : పోలీసుల అదుపులో డ్రగ్ పెడ్లర్ టోని అనుచరులు
హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ మరికొద్ది సేపట్లో పంజాగుట్ట పోలీసు స్టేషన్లో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు, సిబ్బంది నియామకం గురించి పలువురు పోలీసు ఉన్నతాధికారులతో స

Hyderabad CP CV Anand
Hyderabad Police : తెలంగాణలో మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు పోలీసుశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 1000 మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా నూతన విభాగం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ మరికొద్ది సేపట్లో పంజాగుట్ట పోలీసు స్టేషన్లో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు, సిబ్బంది నియామకం గురించి పలువురు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.
ఇప్పటికే పట్టుబడ్డ డ్రగ్ పెడ్లర్ టోనీనీ సీవీ ఆనంద్ ఈరోజు విచారించబోతున్నట్లు తెలిసింది. ఈవిచారణలో సీవీ ఆనంద్‌తో పాటు జాయింట్ సిపి. సిసిఎస్.గజరావు భూపాల్, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్, ఇంటిలిజెన్స్ ఎస్పీ చైతన్య కుమార్,టాస్క్‌ఫోర్స్ డిసిసి రాధాకిషన్ రావులు,నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఏసీపీ నర్సింగ్ రావ్లు పాల్గోంటారు.
డ్రగ్స్ నిర్మూలన కోసం సీవీ ఆనంద్ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసారు. అడిషనల్ డిసిపి,ఎసిపి, ఇన్స్పెక్టర్ లతో డ్రగ్స్‌పై నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇద్దరు ఇన్స్పెక్టర్లను నియమించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజేష్‌తో పాటు వెయిటింగ్లో ఉన్న రమేష్‌రెడ్డి లను నియమిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.త్వరలో పూర్తి స్థాయిలో కొత్త విభాగానికి సంబంధించి సిబ్బంది కేటాయింపులు జరపనున్నారు. ఆ అంశాలను ఈరోజు జరిగే సమావేశంలో నిర్ణయిస్తారు. డ్రగ్స్‌ను వెంటనే పసిగట్టేందుకు అత్యాధునిక పరికరాలను సమీకరించుకునే పనిలో పోలీసుశాఖ ఉంది.
డ్రగ్స్ ఫెడ్లర్ టోని పోలీసు కస్టడీ నేడు ముగియనుంది. చివరిరోజు కావటంతో నేడు జరిపే విచారణ కీలకం కానుంది. టోనీని విచారించి ఇప్పటికే పలు కీలక వివరాలు రాబట్టారు. నాలుగు రాష్టాల్లో ఉన్న వ్యాపారులతో టోనికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గోవా,బెంగుళూరు,ముంబై,కలకత్తా వ్యాపారులతో టోనికి ఉన్న సంబంధాలు…టోనీ ఫోన్ కాల్ డేటా, బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్స్ వివరాలను అతని ముందు ఉంచి పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఈకేసులో కింగ్‌పిన్ స్టార్బాయ్పై అధికారులు ఆరాతీయనున్నారు. ఫోన్ కాల్ లిస్ట్ లో ఉన్న నెంబర్స్ ఎవరివి? ఆ వ్యక్తులు ఎవరు? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న ఆరుగురు టోనీ అనుచరుల అరీఫ్ షేక్, ఖాజా మహ్మద్, అప్తాబ్ పర్వేజ్, రెహమత్, ఇర్ఫాన్, ఫిర్ధోస్లతో పాటు మరో ఇద్దరిని సిసిఎస్ నార్కోటిక్ కంట్రోల్ సెల్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Guntur Jinnah Tower: గుంటూరులో జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు..రంగులే కాదు పేరు మార్చాలని బీజేపీ డిమాండ్
పరారీలో మరో ముగ్గురు వ్యాపారులు సోమ శశికాంత్, సంజయ్ గరెడపల్లి, అలోక్ జైన్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈరోజు విచారణలో టోని ఇచ్చిన సమాచారంతో మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.