సస్పెండ్ అయినా మారలేదు : మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఆర్టీఏ అధికారి

ఆయన ప్రభుత్వ ఆఫీసులో అధికారి. నెల నెల ప్రభుత్వం జీతం ఇస్తుంది. అయినా.. ఆ జీతం సరిపోలేదో ఏమో.. లంచాలకు రుచి మరిగారు. ఏదైనా పని అవ్వాలంటే.. చేతులు

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 02:54 PM IST
సస్పెండ్ అయినా మారలేదు : మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఆర్టీఏ అధికారి

Updated On : February 11, 2020 / 2:54 PM IST

ఆయన ప్రభుత్వ ఆఫీసులో అధికారి. నెల నెల ప్రభుత్వం జీతం ఇస్తుంది. అయినా.. ఆ జీతం సరిపోలేదో ఏమో.. లంచాలకు రుచి మరిగారు. ఏదైనా పని అవ్వాలంటే.. చేతులు

ఆయన ప్రభుత్వ ఆఫీసులో అధికారి. నెల నెల ప్రభుత్వం జీతం ఇస్తుంది. అయినా.. ఆ జీతం సరిపోలేదో ఏమో.. లంచాలకు రుచి మరిగాడు. ఏదైనా పని అవ్వాలంటే.. చేతులు తడపాల్సిందే. ఇదివరకు ఒకసారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. అయినా అతడిలో మార్పు లేదు. మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాయలంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరేందర్ మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

రూ.36వేలు లంచం తీసుకుంటూ ఉండగా… ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నరేందర్.. ఆర్టీఏ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన సీహెచ్ సందీప్ అనే వ్యక్తిని నరేందర్ లంచం డిమాండ్ చేశాడు. ఓ ట్యాంకర్ కు పర్మిషన్ ఇచ్చేందుకు నరేందర్ ఈ లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సందీప్.. ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి ప్లాన్ ప్రకారం.. డబ్బు తీసుకుని సందీప్ వెళ్లాడు. లంచం డబ్బు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా నరేందర్ ను పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

కాగా నరేందర్ లంచం తీసుకుంటూ దొరకడం ఇదే తొలిసారి కాదు. 2016లోనూ ఇలాగే దొరికిపోయాడు. 2016 జనవరి 4వ తేదీన.. రూ.8వేలు లంచం తీసుకుంటూ చిక్కాడు. నరేందర్ పై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని 2016 మార్చి 3న అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఏసీబీ స్పెషల్ కోర్టులో జరుగుతోంది.

ఉద్యోగులకు ప్రభుత్వం నెల నెల జీతం ఇస్తుంది. కొందరికి భారీ మొత్తంలోనే వేతనాలు అందుతాయి. అయినా కొందరు అధికారులు అడ్డదారి తొక్కుతున్నారు. లంచం డిమాండ్ చేస్తున్నారు. లంచం ఇవ్వనిదే పని కావడం లేదు. లంచం ఇవ్వడానికి నిరాకరిస్తే ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఎందుకొచ్చిన గొడవని కొందరు లంచం ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. మరికొందరు మాత్రం ధైర్యంగా ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. అవినీతి పరులను ఏసీబీ అధికారులు కటకటాల్లోకి పంపిస్తున్నారు. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నారు. అయితే జైలు శిక్ష అనుభవించినా, ఉద్యోగం ఊడినా.. కొందరిలో మార్పు లేదు. మళ్లీ మళ్లీ అదే పని చేసి అడ్డంగా దొరికిపోతున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అనే విషయం అందరికి తెలుసు. కానీ ఫాలో మాత్రం అవ్వడం లేదు.