హైదరాబాద్‌లో విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలోని హస్తినాపురంలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. సంతోషిమాత కాలనీలో ఈ ఘటన జరిగింది. మృతులు

  • Published By: veegamteam ,Published On : March 2, 2020 / 05:31 AM IST
హైదరాబాద్‌లో విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య

Updated On : March 2, 2020 / 5:31 AM IST

హైదరాబాద్ నగరంలోని హస్తినాపురంలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. సంతోషిమాత కాలనీలో ఈ ఘటన జరిగింది. మృతులు

హైదరాబాద్ నగరంలోని హస్తినాపురంలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. సంతోషిమాత కాలనీలో ఈ ఘటన జరిగింది. మృతులు ప్రదీప్‌(40), భార్య స్వాతి(35), కొడుకులు కళ్యాణ్‌ కృష్ణ(6), జయకృష్ణ(2)గా గుర్తించారు. 

ప్రదీప్.. IBM కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య స్వాతి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 2012లో ప్రదీస్, స్వాతిల పెళ్లి జరిగింది. ఎల్బీనగర్ పరిధిలోని హస్తినాపురంలోని సంతోషిమాత కాలనీలో ప్రదీప్ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. నాలుగేళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న ప్రదీప్.. ఇటీవలే సొంతిల్లు కట్టుకున్నాడు. ఇంతలో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని, కొన్ని రోజులుగా ప్రదీప్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని బంధువులు తెలిపారు. భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన ప్రదీప్, ఆ తరువాత తను కూడా విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రదీప్‌ స్వస్థలం ఇబ్రహీంపట్నం.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు దుర్వాసన వస్తుండటంతో.. శనివారం(ఫిబ్రవరి 29,2020) సాయంత్రమే.. ప్రదీప్ కుటుంబం చనిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రదీప్ ఇంట్లో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నామని అందులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం బాధించింది. అభంశుభం తెలియని చిన్నపిల్లలు ఏం పాపం చేశారని వాపోతున్నారు. అయినా.. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. సమస్యలకు చావు పరిష్కారం కాదన్నారు.

See Also | బాలికను గ్యాంగ్ రేప్ చేసి, చెట్టుకి ఉరితీసిన, పదో తరగతి విద్యార్థులు దొరికారు

* శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) చివరిసారిగా తండ్రి యాదయ్యతో మాట్లాడిన ప్రదీప్
* శనివారం(ఫిబ్రవరి 29,2020) అన్ని వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఎగ్జిట్
* ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసిన ప్రదీప్
* అనుమానం వచ్చి ప్రదీప్ ఫోన్ కు పదే పదే కాల్ చేసిన తండ్రి యాదయ్య

* ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఆదివారం(మార్చి 1,2020) ఉదయం ప్రదీప్ ఇంటికి వచ్చిన యాదయ్య
* ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయిన యాదయ్య
* ఆదివారం రాత్రి పోలీసులను తీసుకొచ్చిన యాదయ్య.. డోర్లు ఓపెన్ చేయడంతో వెలుగులోకి వచ్చిన విషాదం