Fire Accident : అగ్నిప్రమాదంలో గవర్నమెంట్ టీచర్ సజీవ దహనం

హైదరాబాద్ వనస్ధలిపురంలోని ఎఫ్.సీ.ఐ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఓ మహిళ సజీవదహనం కాగా... ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

Fire Accident : అగ్నిప్రమాదంలో గవర్నమెంట్ టీచర్ సజీవ దహనం

Fire Accident

Updated On : May 24, 2021 / 1:57 PM IST

Fire Accident : హైదరాబాద్ వనస్ధలిపురంలోని ఎఫ్.సీ.ఐ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం కాగా… ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఎఫ్.సీ.ఐ కాలనీలో నివాసం ఉంటున్న బాలకృష్ణ, సరస్వతి (42) దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భర్త బాలకృష్ణ తన ఇద్దరు పిల్లల్ని బయటకు తీసుకువచ్చి, భార్యను తీసుకు వచ్చేందుకు లోపలకు వెళ్లాడు.  కానీ, ఆమెను అక్కడినుంచి రక్షించటానికి భర్త చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అప్పటికే సరస్వతికి మంటలు అంటుకుని శరీరమంతా వ్యాపించాయి.

ఆమె అక్కడికక్కడే సజీవ దహనం అయ్యింది. భార్యను కాపాడే యత్నంలో బాలకృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్రగాయాలపాలైన బాలకృష్ణను స్ధానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.