సోషల్ మీడియాలో స్నేహం…న్యూడ్ ఛాటింగ్…బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి

సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యాయక నేరాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని ఒక యువతి టెక్కీ దగ్గర్నించి మూడున్నర లక్షలకు పైగా వసూలు చేసింది. టెక్కీతో నగ్నంగా చాటింగ్ చేసి ఆ ఫోటోలను అడ్డంపెట్టుకుని, బ్లాక్ మెయిల్ చేసింది. లబోదిబో మంటూ ఆ టెక్కీ ఇప్పడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
గతంలో అబ్బాయిలు మోసం చేశారని అమ్మాయిలు పోలీసు స్టేషన్లో కేసుపెట్టేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. పోలీసులకు వస్తున్నకేసుల్లో అమ్మాయిల వల్లమోసపోతున్న అబ్బాయిల కేసులు కూడా ఉంటున్నాయి. వీరిలో ఐటీ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉండటం విశేషం. కిలాడీ లేడీలు ఇలాంటి టెక్కీలనే లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని వారివద్ద నుంచి డబ్బులు గుంజుతున్నారు.
హైదరాబాద్ కు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కరోనా లాక్డౌన్ టైమ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఖాళీ సమయంలో ఇతర సోషల్ మీడియా సైట్లతో కాలక్షేపం చేసేవాడు. ఇన్స్టా గ్రాం ద్వారా అతనికి ఒక యువతి పరిచయం అయ్యింది. ఇద్దరూ ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరుతెలుసుకుని చాటింగ్ చేసుకోవటం మొదలెట్టారు.
కాల క్రమంలో చాటింగ్…. మాటలు దాటి … న్యూడ్ ఫోటోలతో చాటింగ్ చేసుకోవటం ప్రారంభించారు. ఒక రోజు ఆ యువతి తన న్యూడ్ వీడియో పంపించి, ఆ యువకుడి న్యూడ్ వీడియో కూడా పంపమని కోరింది. ఆడపిల్ల పంపగా లేనిది నాకేంటి అనుకుని ఆయువకుడు తన న్యూడ్ వీడియో కూడా పంపించాడు.
చాటింగ్ ద్వారా,వీడియో కాల్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా గంటల తరబడి ఇద్దరూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ యువకుడి పరిచయస్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల నెంబర్లు ఆ యువతి తెలుసుకుంది. ఒక రోజు ఉన్నట్టుండి ఆయువకుడి న్యూడ్ వీడియో అతనికే పంపించి బెదిరించటం మొదలెట్టింది.
తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ వీడియో నీ ఫ్రెండ్స్ కు చుట్టాలకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేయసాగింది. దీంతో భయపడి పోయిన యువకుడు వారం రోజుల్లో ఆ యువతికి రూ. 3.63 లక్షలు చెల్లించాడు. అయినా ఆ యువతి ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేయటం మొదలు పెట్టేసరికి …వేధింపులు భరించలేని యువకుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read: వ్యభిచారం చేయమని భర్త వేధింపులు : దివ్య కేసులో కొత్త ట్విస్టు