ఏం జరిగింది : ప్రేమ పెళ్లి చేసుకున్న 20 రోజులకే మృతి

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 06:12 AM IST
ఏం జరిగింది : ప్రేమ పెళ్లి చేసుకున్న 20 రోజులకే మృతి

Updated On : December 4, 2019 / 6:12 AM IST

హైదరాబాద్ లోని సనత్ నగర్ లో కొత్తగా పెళ్లి అయిన యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రేమపెళ్లి చేసుకున్న 20 రోజులకే పూర్ణిమ చనిపోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అవతున్నాయి.

పూర్ణిమ పెళ్లి చేసుకున్న కార్తీక్ ఆమెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తూ..సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంతరం పీఎస్ ఎదుట ఆందోళన చేస్తూ..తమకు న్యాయం చేయమని తమ బిడ్డను చంపిన కార్తీక్ కు కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమపెళ్లి చేసుకున్న పూర్ణిమ  అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సనత్ నగర్‌లో కలకలం రేపింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న పూర్ణిమ ప్రేమించిన 20 రోజుల క్రితం దాసరి కార్తీక్‌ను పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంది. ఈ క్రమంలో పెళ్లై నెల రోజులు పూర్తి కాకుండానే పూర్ణిమ మృతి చెందటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.