Extra Marital Affair : ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళతో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం

భర్తతో విభేదాలు ఉన్న మహిళ ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్‌కు వస్తే ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఒక కానిస్టేబుల్.

Extra Marital Affair : ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళతో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం

Extra marital Affair

Updated On : February 26, 2022 / 4:06 PM IST

Extra Marital Affair : భర్తతో విభేదాలు ఉన్న మహిళ ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్‌కు వస్తే ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఒక కానిస్టేబుల్.  కర్ణాటక లోని నంజనగూడు తాలుకా హుల్లహళ్ళి పోలీసు స్టేషన్ లో సి.కృష్ణ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అతను టి.నరసిపుర తాలూకా బన్నూరు పోలీసు స్టేషన్ లో పని చేసే సమయంలో గౌరమ్మ అనే మహిళ భర్త నంజయ్యతో విభేదాలు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయటానికి స్టేషన్ కు వచ్చింది.

ఆమె వద్ద ఫిర్యాదు తీసుకున్న అనంతరం కృష్ణ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కృష్ణ మాటలు నమ్మిన గౌరమ్మ   భర్త  నుంచి విడాకులు తీసుకుంది.    ఆమెను మాయమాటలతో లోబరుచుకుని మైసూరులో కాపురం పెట్టాడు. ఆమె పేరుమీద సోసైటీలో రూ. 5లక్షల లోన్ తీసుకున్నాడు. విడిగా మరో రూ.3 లక్షలు లోన్ తీసుకున్నాడు.

కొన్నాళ్లకు ఆమె పెళ్లి చేసుకోమని కృష్ణను కోరగా అందుకు అతడు అంగీకరించలేదు. ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదని… తాను చెప్పినట్లు వినకపోతే కష్టాలు తప్పవని బెదిరించాడు. ఇటీవల కృష్ణ, అతని కుమారుడు కిరణ్ కలిసి ఆమెను తీవ్రంగా కొట్టి పోలంలో పడేశారు.
Also Read : Ganja Seized : విహార యాత్రతో గంజాయి వ్యాపారం-నలుగురు అరెస్ట్
ఆమెను గమనించిన స్ధానికులు మైసూరులోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె హుల్లహుళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు