26/11 ఉగ్రవాది కసబ్.. చేతికి ఎర్రదారంతో సమీర్ చౌదరిలా చనిపోదామనుకున్నాడు!

  • Published By: sreehari ,Published On : February 18, 2020 / 09:14 PM IST
26/11 ఉగ్రవాది కసబ్.. చేతికి ఎర్రదారంతో సమీర్ చౌదరిలా చనిపోదామనుకున్నాడు!

Updated On : February 18, 2020 / 9:14 PM IST

26/11 ముంబై దాడుల ఉగ్రవాది మొహమ్మద్ అజ్మల్ అమిర్ కసబ్ బెంగళూరు నివాసి సమీర్ దినేష్ చౌదరిలా మరణించాడు. తన చేతి మణికట్టుకు ఎర్రదారాన్ని ధరించి సమీర్ చౌదరీ (హిందువు)లా చనిపోదామనుకున్నాడు. తమ పథకాన్ని అనుకున్నట్టుగా అమలు చేయడంలో ఉగ్రవాద సంస్థ లష్కరే-ఈ-తోయిబా (LeT) సక్సెస్ సాధించింది. ఈ విషయాన్ని మాజీ ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా రివీల్ చేశారు. తాను let me say it now అనే టైటిల్ తో ఒక పుస్తకాన్ని రాశారు. అందులో మారియా చెప్పినట్టుగా.. ఉగ్రవాద సంస్థ హిందు ఉగ్రవాదంతో ముంబైలో దాడి చేయాలని ప్లాన్ చేసినట్టుగా ఉంది. ముంబైలో హిందు ఉగ్రవాదులు ఎలా దాడి చేశారు అనేది అప్పట్లో వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. 

కొంతమంది టీవీ జర్నలిస్టులు బెంగళూరుకు చెందిన అతడి కుటుంబం, పొరుగువారిని ఇంటర్వ్యూలు కూడా చేశారు. కానీ, అతడు ఎవరో తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే.. నిజానికి అతడి పేరు.. అజ్మల్ అమిర్ కసబ్.. పాకిస్థాన్ లోని ఫారిద్ కాట్ కు చెందిన వ్యక్తిగా మారియా తన పుస్తకంలో ప్రస్తావించారు. అంతకుముందు.. హైదరాబాద్ లో అరుణోదయ కాలేజీకి చెందిన ఫేక్ ఐడీ కార్డులను కొంతమంది ఉగ్రవాదులు తీసుకెళ్లినట్టుగా రిపోర్టు తెలిపింది. అదే తరహాలో కసబ్ కూడా ఇలాంటి ఫేక్ ఐడీ కార్డును ప్లాన్ చేసినట్టు ముంబై అధికారి తెలిపారు. 

దొంగతనాల కోసం లష్కరేలో చేరిన కసబ్ :
షీనా బోరా కేసును విచారించేటప్పుడు హఠాత్తుగా హోమ్ గార్డ్ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందిన మరియా.. కసబ్ మొదట్లో లష్కర్-ఎ-తోయిబాలో దొంగతనాలు చేసేందుకు చేరాడని, అప్పట్లో అతడికి జిహాద్‌తో ఎలాంటి సంబంధం లేదని రివీల్ చేశాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కసబ్.. అతని స్నేహితుడు ముజఫ్ఫర్ లాల్ ఖాన్ కలిసి దొంగతనాలు చేయాలనుకునేవారు. దొంగతనాలు చేసేటప్పుడు అవసరమైన కొన్ని ఆయుధాలతో పాటు శిక్షణ కూడా తీసుకోవాలని భావించినట్టు మరియా చెప్పకొచ్చారు.

‘భారతదేశంలో ముస్లింలను నమాజ్ చేసేందుకు అనుమతించలేదని కసబ్ బలంగా నమ్మాడు. మసీదులను అధికారులు లాక్ చేశారు. క్రైమ్ బ్రాంచ్ లాకప్‌లోనే రోజుకు ఐదుసార్లు అజాన్ విన్నట్టుగా తన ఊహాకు ఒక కల్పన మాత్రమే అని మరియా అభిప్రాయపడ్డారు. ఎప్పుడు అయితే ఆ విషయం తెలిసిందో వెంటనే.. మెహాలె (దర్యాప్తు అధికారి రమేశ్ మెహాలె)ను మెట్రో సినిమాకు దగ్గరలోని మసీదుకు ఒక వాహనంలో అతన్ని తీసుకెళ్లమని తాను ఆదేశించినట్టు మరియా చెప్పారు. అప్పటికే నమాజ్ జరుగుతుండటం చూసిన కసబ్.. చికాకు పడినట్టుగా అధికారి తెలిపారు. 

కసబ్‌ను చంపాలని.. దావూద్ ఇబ్రహీం ముఠా  ప్లాన్ : 
కసబ్‌ను సజీవంగా ఉంచడం తన తొలి ప్రాధాన్యతగా మారిందని మరియా వెల్లడించారు. అతని పట్ల కోపం, శత్రుత్వం (ముంబై పోలీసు సిబ్బందిలో) కనిపించాయి. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) లష్కర్ సంస్థలు అతడు చేయబోయే దాడులకు సంబంధించి సాక్ష్యాలను నిర్మూలించేందుకు అతన్ని హతమార్చేందుకు మొగ్గు చూపాయి’ అని మరియా తన పుస్తకంలో రాశారు. కసబ్‌ను చంపే బాధ్యత దావూద్ ఇబ్రహీం ముఠాకు అప్పగించినట్టు తెలిపారు. కసబ్ ఛాయాచిత్రం విడుదలైనప్పుడు.. సెంట్రల్ ఏజెన్సీల చేతిపని అని మరియా రివీల్ చేశారు. 

అయితే భద్రత కోసం భయపడి ముంబై పోలీసులు మీడియాకు ఎలాంటి వివరాలను వెల్లడించకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కసబ్‌ను ప్రతిరోజూ వ్యక్తిగతంగా తాను విచారించేవాడని మాజీ పోలీసు అధికారి మరియా వెల్లడించారు. ఉగ్రవాద సంస్థలు ఎలా పనిచేస్తాయనే దానిపై నాకు లోతైన అవగాహన ఉందన్నారు. తమ రోజువారీ పరస్పర చర్యలు కసబ్‌కు తనకు మధ్య ఒక విధమైన బంధం ఏర్పడినట్టు తెలిపారు. అప్పటినుంచి కసబ్ తనను గౌరవప్రదంగా ‘జనబ్’ (సర్) అని సంబోధించడం ప్రారంభించాడు. 

మూడు రౌండ్ల శిక్షణ తర్వాత.. కసబ్‌కు రూ .1,25,000తో పాటు వారం రోజుల వరకు కుటుంబాన్ని కలిసేందుకు సెలవు ఇవ్వడం జరిగింది. అతను తన సోదరి వివాహం కోసం తన కుటుంబానికి ఆ మొత్తం డబ్బు ఇచ్చినట్టు మరియా పుస్తకంలో రాసుకొచ్చారు. వాస్తవానికి, ముంబైపై ఉగ్రవాద దాడికి 2008 సెప్టెంబర్ 27న (రంజాన్) 27వ రోజున ప్లాన్ చేసింది ఉగ్రవాద సంస్థ.