Kerala murder : కేరళలో దారుణం…భార్యను చంపి భర్త అత్మహత్య

షష్టి పూర్తికి దగ్గరలో ఉన్న దంపతులు కూడా కుటుంబ కలహాలతో కొట్టుకుంటున్నారు... కోపం పట్టలేని భర్త, భార్యను హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలోని కొడకల్లులో చోటు చేసుకుంది.

Kerala murder : కేరళలో దారుణం…భార్యను చంపి భర్త అత్మహత్య

Husbaand Kills Wife

Updated On : March 13, 2021 / 6:02 PM IST

Kerala : 59 years old husband kills wife, ends life in atholi : షష్టి పూర్తికి దగ్గరలో ఉన్న దంపతులు కూడా కుటుంబ కలహాలతో కొట్టుకుంటున్నారు… కోపం పట్టలేని భర్త, భార్యను హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలోని కొడకల్లులో చోటు చేసుకుంది.

గ్రామంలో నివసించే కృష్ణన్(59) శోభన (50)  భార్యా భర్తలు. మార్చి 10 వ తేదీ రాత్రి భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది.  ఈ క్రమంలో కోపం పట్టలేని కృష్ణన్ భార్యను కర్రతో విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ దెబ్బలకు తీవ్ర రక్తస్రావమైన శోభన అక్కడి కక్కడే మరణించింది.

కాగా భర్త కొడుతున్న దెబ్బలు భరించలేని శోభన గట్టిగా అరవటంతో ఇరుగు పోరుగు వారు ఇంటికి చేరుకున్నారు. వారిని చూసి కృష్ణన్ ఇంట్లోంచి పరారయ్యాడు. తీవ్రగాయలతో పడిపోయిన శోభనను స్ధానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.

కృష్ణన్ కోసం కొంతమంది వెతక నారంభించారు. అయినా అతని ఆచూకి లభ్యం కాలేదు. ఇంట్లోంచి పారిపోయిన కృష్ణన్ ఇంటి సమీపంలోని ఒక చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మరునాడు ఉదయం కృష్ణన్ శవాన్ని చూసిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కృష్ణన్, శోభన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. కుటుంబ కలహాల కారణంతోనే హత్యజరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆథోలి ఎస్సై బాలచంద్రన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.