వాటేసుకుని అక్కడ ముద్దులు పెట్టాడు : కేరళ బిషప్‌పై మరో నన్ లైంగిక వేధింపుల ఆరోపణలు

క్రైస్తవ సన్యాసిని(నన్)పై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన కేరళ బిషప్(మత బోధకుడు) ఫ్రాంకో ములక్కల్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. బిషప్ బారిన

  • Published By: veegamteam ,Published On : February 22, 2020 / 03:23 AM IST
వాటేసుకుని అక్కడ ముద్దులు పెట్టాడు : కేరళ బిషప్‌పై మరో నన్ లైంగిక వేధింపుల ఆరోపణలు

Updated On : February 22, 2020 / 3:23 AM IST

క్రైస్తవ సన్యాసిని(నన్)పై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన కేరళ బిషప్(మత బోధకుడు) ఫ్రాంకో ములక్కల్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. బిషప్ బారిన

క్రైస్తవ సన్యాసిని(నన్)పై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన కేరళ బిషప్(మత బోధకుడు) ఫ్రాంకో ములక్కల్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. బిషప్ బారిన పడ్డ బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మరో నన్.. బిషప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. బిషప్ ములక్కల్ తనపైనా లైంగిక దాడి చేసినట్లు మరో నన్ తెలిపింది. బలవంతంగా ముద్దులు పెట్టాడని, లైంగికంగా వేధించాడని ఆరోపించింది. నన్ పై అత్యాచార కేసులో 14వ సాక్షిగా ఉన్న మరో నన్(35).. ఈ మేరకు వాంగూల్మం ఇచ్చింది. 

వాట్సాప్‌లో బూతులు:
నేను బిషప్ ను తొలిసారి 2015లో బీహార్ లో కలిశాను. 2015-17 మధ్య కాలంలో ములక్కల్, నేను ఫోన్ కాల్స్,  వీడియో కాల్స్ చేసుకునే వాళ్లం. కాన్వెంట్ అవసరాల కోసం అనేకసార్లు బిషప్ కు ఫోన్ చేసి మాట్లాడాను. వాట్సాప్ లో చాటింగ్ చేసుకునేవాళ్లం. ముందు మంచిగానే ఉన్న బిషప్ ఆ తర్వాత తన అసలు రూపం చూపాడు. 2015 ఏడాది చివరి నుంచి మాటలతో వేధించడం ప్రారంభించాడు. అతడి మాటల్లో తేడా గమనించాను. నన్‌ అని కూడా చూడకుండా బూతులు మాట్లాడేవాడు. ఓసారి మా కాన్వెంట్ కు వచ్చి నన్ను గట్టిగా వాటేసుకుని ముద్దులు పెట్టాడు. ఆ తర్వాత వీడియో కాల్స్ చేసి తన దేహంలోని భాగాలు, నా దేహంలోని భాగాల గురించి మాట్లాడాడు…’ అని బాధితురాలు చెప్పింది.

భయంతో ఫిర్యాదు చెయ్యలేదు:
సెక్స్ గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేకపోయినా బిషప్ భయంతో.. చర్చి నుంచి గెంటేస్తారనే భయంతో.. మౌనంగా ఉండిపోయానని, బిషప్ తో వాట్సాప్ లో చాటింగ్ చేయాల్సి వచ్చిందని నన్న వాపోయింది. ఈ విషయాన్ని బయటికి చెబితే బిషప్  తనకు హాని చేస్తాడని, నన్ గా తొలగిస్తాడని భయపడ్డానని, అందుకే అప్పట్లో చెప్పలేదని వివరించింది. 

వెలుగులోకి బిషప్ అరాచకాలు:
మిషనరీస్ ఆఫ్ జీసన్ సంస్థకు చెందిన ములక్కల్.. తనపై పలుమార్లు అత్యాచారం చేశారని కొట్టాయం కాన్వెంటుకు చెందిన ఓ నన్ ఆరోపించడంతో రెండేళ్ల కింద కేసు నమోదైంది. బిషప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2019లో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసుకి సంబందించి దర్యాఫ్తు జరుగుతోంది. కొన్ని గంటల్లో బిషప్ డిశ్చార్జ్ పిటిషన్ విచారణకు రానుంది. దీనికి ముందు మరో నన్ బిషప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది.

Read More>>ముస్లింలను అప్పుడే పాకిస్తాన్ పంపించి ఉండాల్సింది