Kerala Bomb Blasts : కేరళలో పేల్చిన బాంబు తయారీకి రూ.3వేల ఖర్చు…ఇంటర్నెట్‌లో చూసి తయారు చేసిన నిందితుడు
కేరళ రాష్ట్రంలో జరిపిన పేలుళ్లలో వినియోగించిన బాంబు ఎలా తయారు చేశారు? ఎంత వ్యయంతో తయారు చేశారనే కీలక ఆధారాలు పోలీసులకు లభించాయి....

Kerala Bomb Blast
Kerala Bomb Blasts : కేరళ రాష్ట్రంలో జరిపిన పేలుళ్లలో వినియోగించిన బాంబు ఎలా తయారు చేశారు? ఎంత వ్యయంతో తయారు చేశారనే కీలక ఆధారాలు పోలీసులకు లభించాయి. కేరళ చర్చ్ లో పేల్చేందుకు నిందితుడు డొమినిక్ మార్టిన్ బాంబులు ఉంచాడని పోలీసులు తేల్చారు.
బాంబులు ఎలా తయారు చేశాడంటే…
బాంబు పేలుళ్ల నిందితుడైన మార్టిన్ ఇంటర్నెట్ లో చూసి బాంబులను తయారు చేశాడని వెల్లడైంది. బాంబుల తయారీకి మూడువేల రూపాయలను ఖర్చు చేసినట్లు 48 ఏళ్ల డొమినిక్ మార్టిన్ చెప్పారు. మార్టిన్ కుటుంబం ఐదేళ్లుగా కొచ్చి సమీపంలో అద్దెకు ఉంటోంది. ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో నిపుణుడైన మార్టిన్ దుబాయ్‌లో ఫోర్‌మెన్‌గా చాలా సంవత్సరాలపాటు పనిచేశాడు. అక్కడే అతను ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారు చేయడం నేర్చుకున్నాడు.
దుబాయ్ నుంచి వచ్చి…పేలుళ్లకు పాల్పడిన నిందితుడు
మార్టిన్ రెండు నెలల క్రితం దుబాయ్ నుంచి తిరిగి వచ్చి పేలుళ్లకు పాల్పడ్డాడని పోలీసు వర్గాలు తెలిపాయి. బాణాసంచా తయారీలో ఉపయోగించే తక్కువ గ్రేడ్ పేలుడు పదార్థాలతో బాంబులు తయారు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసులకు మార్టిన్ ఇంట్లో ఐఈడీ పదార్థాలు దొరికాయి. పోలీసులకు లొంగిపోయే ముందు మార్టిన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వీడియో సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు.
Also Read : India S-400 Missiles : చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత్ ఎస్-400 క్షిపణుల మోహరింపు…ఎందుకంటే?
సమాజం, ప్రజలకు, పిల్లలకు కూడా తప్పుడు విలువలను బోధిస్తున్నదని వీడియోలో చెప్పాడు. ఆదివారం కొచ్చి సమీపంలోని కలమసేరిలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వరుస పేలుళ్లలో ఇద్దరు మహిళలు, 12 ఏళ్ల బాలిక మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. యెహోవాసాక్షుల సమావేశానికి రెండు వేల మంది ప్రజలు హాజరయ్యారు. ప్రార్థనా సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మూడు పేలుళ్లు సంభవించినట్లు సమాచారం.
Also Read : Onion Prices : దేశంలో ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు…తెరవెనుక కథ
ప్రార్థన మధ్యలో మొదటి పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాంబు పేలిన తర్వాత పొగ వ్యాపించింది. దీంతో తొక్కిసలాటకు దారితీసిందని పోలీసు అధికారులు తెలిపారు. కేరళలో ఈ వరుస పేలుళ్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు విచారణ చేపట్టారు.
Also Read : Police Arrest : పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో డ్రగ్స్ విక్రేత ఏం చేశాడంటే…షాకింగ్ సీన్