TSPSC Paper Leak Case : TSPSC పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం.. ఆ ముగ్గురు అరెస్ట్

TSPSC Paper Leak Case : ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా రమేశ్ సమాధానాలు చేరవేసినట్లుగా విచారణలో వెల్లడైంది.

TSPSC Paper Leak Case : TSPSC పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం.. ఆ ముగ్గురు అరెస్ట్

TSPSC (Photo : Google)

Updated On : May 29, 2023 / 11:01 PM IST

SIT Arrest : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం సిట్ బృందం మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. ప్రశాంత్, మహేశ్, నవీన్ లను అదుపులోకి తీసుకుంది. ఏఈఈ పరీక్షలో ప్రశాంత్, నవీన్, మహేశ్.. ఎలక్ట్రానిక్ డివైజ్‌ వాడారని అధికారులు చెప్పారు.

ఇప్పటికే ఈ కేసులో వరంగల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్(డీఈ) రమేశ్ ను సిట్ అరెస్ట్ చేసింది. డీఈ రమేశ్ ద్వారా పేపర్ కొనుగోలు చేసిన ఆ ముగ్గురు నిందితులు.. ఎలక్ట్రానిక్ డివైజ్ ఉపయోగించి పరీక్ష రాసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఏఈఈ, డీఏఓ పరీక్షకు సంబంధించిన 25 ప్రశ్నాపత్రాలను రమేశ్ విక్రయించినట్లుగా దర్యాఫ్తులో తేలింది. ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా రమేశ్ సమాధానాలు చేరవేసినట్లుగా విచారణలో వెల్లడైంది.

Raghunandan Rao : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌పై రూ.1000 కోట్లకు పరువు నష్టం దావా

సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాఫ్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో 46మందిని సిట్ అరెస్ట్ చేసింది. పరీక్షలు ఎవరెవరు రాశారు? ఎక్కడెక్కడ రాశారు? వారి వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు సిట్ అధికారులు. ఈ క్రమంలో ఎగ్జామ్ హాల్ లో ఎలక్ట్రానిక్ డివైజ్ వాడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీఈ రమేశ్ ద్వారా లక్షల రూపాయలకు క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేశారు. క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేయడమే కాకుండా ఎలక్ట్రానిక్ డివైజ్ ఉపయోగించి పరీక్ష రాసినట్లు.. సిట్ గుర్తించింది. ఒకవైపు సిట్ అధికారుల దర్యాఫ్తు కొనసాగుతోంది. మరోవైపు ఈడీ అధికారులు కూడా విచారిస్తున్నారు.

Also Read..Uppal Constituency: ఒకసారి గెలిచిన వారు రెండోసారి ఎమ్మెల్యే కాలేదు.. బీఆర్‌ఎస్‌ లో రెండు వర్గాలు.. ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్