Hemant Sivaramakrishna : అమెరికాలో ఖమ్మం విద్యార్థి గుండెపోటుతో మృతి

చికిత్స కోసం స్నేహితులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. విద్యార్థి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు అతడి స్నేహితులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Hemant Sivaramakrishna : అమెరికాలో ఖమ్మం విద్యార్థి గుండెపోటుతో మృతి

Hemant Sivaramakrishna

Updated On : April 19, 2023 / 10:28 AM IST

Hemant Sivaramakrishna : అమెరికాలో ఖమ్మం విద్యార్థి హఠాన్మరణం చెందారు. అమెరికాలోని బార్బ డోస్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న హేమంత్ శివరామకృష్ణ (20) అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. 2021లో హేమంత్ శివరామకృష్ణ బార్బడోస్ కు వెళ్లారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న హేమంత్ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యాడు.

చికిత్స కోసం స్నేహితులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. విద్యార్థి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు అతడి స్నేహితులు ఏర్పాట్లు చేస్తున్నారు. హేమంత్ మృతితో అతని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Telangana Student Died : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి

హేమంత్ తండ్రి రవికుమార్ ఖమ్మం నగరంలోని ట్రాఫిక్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. రవికుమార్ ప్రస్తుతం ఖమ్మం గ్రామీణ మండలం సాయిప్రభాత్ నగర్ లో నివసిస్తున్నారు. రవికుమార్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేశ్, పోలీసు సిబ్బంది పరామర్శించారు.