సీరియల్ హత్యల కేసు : 14ఏళ్లలో ఆరుగురు కుటుంబసభ్యులను చంపిన మహిళ రెండో భర్త అరెస్ట్
కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీరియల్ మర్డర్స్ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అయిన జాలీ జోసెఫ్ రెండో

కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీరియల్ మర్డర్స్ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అయిన జాలీ జోసెఫ్ రెండో
కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీరియల్ మర్డర్స్ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు జాలీ జోసెఫ్ రెండో భర్త షాజూ జచారియాను(44) క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడిని విచారిస్తున్నారు. అతడి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కుటుంబసభ్యులను మర్డర్ చేయడంలో జాలీ జోసెఫ్ కి షాజూ సహకరించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
షాజూ ఓ హైస్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాడు. హత్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని షాజూ చెబుతున్నాడు. పోలీసులు అతడి అకౌంట్లు సీజ్ చేశారు. ఆస్తి కోసం అత్త మామలనే కాదు భర్తను కూడా జాలీ జోసెఫ్ చంపేసింది. ఇందులో షాజూ ప్రమేయం కూడా ఉందని ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు షాజూని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షాజూ జచారియా.. జాలీ జోసెఫ్ మామ తమ్ముడి కొడుకు.
భర్త ఆస్తి మీద కన్నేసిన జాలీ జోసెఫ్.. భర్త సోదరుడితో(కజిన్ బ్రదర్) కలిసి దారుణానికి ఒడిగట్టింది. 14ఏళ్లలో కుటుంబసభ్యులను ఒక్కొక్కరిని చంపుతూ వచ్చింది. అత్త మామలను, భర్తను, భర్త సోదరుడి భార్యను, ఆమె రెండేళ్ల పాపను మర్డర్ చేసింది. 2002 నుంచి 2016 వరకు ఈ మర్డర్లు జరిగాయి. 2017లో జాలీ, షాజూ పెళ్లి చేసుకున్నారు.
కేసు విచారణలో భాగంగా పోలీసులు షాజూని ప్రశ్నించారు. అయితే తనకేమీ తెలియదని బుకాయించాడు. జాలీ జోసెఫ్ అరెస్ట్ తర్వాత షాజూ తన ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయాడు. వస్తువులు కూడా తీసుకెళ్లిపోయాడు. కంప్యూటర్ ని పట్టుకెళ్లాడు. దీంతో పోలీసులకు అనుమానాలు పెరిగాయి. ఆధారాలను నాశనం చెయ్యడానికి షాజూ ప్రయత్నం చేసినట్టు సందేహిస్తున్నారు.
జాలీతో ఆర్థిక వ్యవహారాలు నడిపిన స్థానిక కాంగ్రెస్ నేత రామక్రిష్ణ ఇటీవలే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ కేసుని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అతడి మరణం వెనుక జాలీ హస్తం ఉందా అనే కోణంలో దర్యాఫ్తు చేపట్టారు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు రామక్రిష్ణ సుమారు రూ.55 లక్షలు విలువ చేసే ఆస్తిని కోల్పోయారని అతడి కొడుకు తెలిపాడు.
ఆస్తి కోసం జాలీ జోసెఫ్ ఆరుగురు కుటుంబసభ్యులను చంపేసింది. 2002లో ఫస్ట్ మర్డర్ జరిగింది. అత్త అన్నమ్మ థామస్ ను మట్టుబెట్టింది. ఆరేళ్ల తర్వాత అంటే 2008లో మామని, 2011లో భర్తని, 2014లో అత్త సోదరుడిని చంపేసింది. ఆ తర్వాత షాజూ భార్య, కూతురిని కూడా హతమార్చింది. మటన్ సూప్ లో సైనెడ్ కలిపి ఒక్కొక్కరిని చంపుతూ వచ్చింది. అయితే ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పక్కా ప్లాన్ ప్రకారం హత్యలు చేసింది. ఓ రోజు పాపం పండి.. జాలీ జోసెఫ్ కిరాతకాలు బయటపడ్డాయి. అన్నమ్మ థామస్ బంధువులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం నివేదికలో దిమ్మతిరిగే నిజం బయటపడింది. ఆహారంలో సైనెడ్ కలిపి చంపేసినట్టు గుర్తించారు. ఈ సీరియల్ మర్డర్లు కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి.