Kolleru : కొల్లేరు మధ్యలో నాటుసారా డంప్ సీజ్.. ఫొటోలు చూస్తే మైండ్ బ్లాక్

కృష్ణాజిల్లా కైకలూరు లోని కొల్లేరు లంక గ్రామాల్లోతయారు చేస్తున్న నాటుసారా స్ధావరాలపై కృష్ణాజిల్లా ఎస్పీ సిధ్ధార్ధకౌశల్ నాయకత్వంలో పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేశారు.

Kolleru : కొల్లేరు మధ్యలో నాటుసారా డంప్ సీజ్.. ఫొటోలు చూస్తే మైండ్ బ్లాక్

Krishna Sp Natu Sara

Updated On : November 3, 2021 / 7:31 PM IST

నాటు సారా స్థావరాలపై కృష్ణా జిల్లా ఎస్పీ దాడులు

Kolleru :  కృష్ణాజిల్లా కైకలూరు లోని కొల్లేరు లంక గ్రామాల్లోతయారు చేస్తున్న నాటుసారా స్ధావరాలపై కృష్ణాజిల్లా ఎస్పీ సిధ్ధార్ధకౌశల్ నాయకత్వంలో పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేశారు. జిల్లాలోని కైకలూరు మండలం, పందిరిపల్లిగూడెం గ్రామ పరిధిలోని 280 ఎకరాల కొల్లేరు చెరువులో మరపడవలలో ఈరోజు ఆయన తన సిబ్బందితో ప్రయాణించి నాటు సారాస్ధావరాలును ధ్వంసం చేశారు.

Krishna Sp Destroy Natu Sara 1

Krishna Sp Destroy Natu Sara 1

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వారి ఆదేశాలను ఖాతరు చేయకుండా నాటు సారా తయారు చేస్తే సహించేది లేదని, అయినా మారకుండా నాటుసారా తయారీకి పాల్పడిన, పాల్పడే వారికి సహకరించిన, రవాణా, విక్రయాలు చేసిన వారిపై suspectసీట్లు తెరవడమే కాక, అవసరం మేరకు పీడీ యాక్ట్ను అమలు పరచడం జరుగుతుందని చెప్పారు. కొల్లేరు లో నాటు సారా తయారీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి నాటుసారా, తయారీకి ఉపయోగించే పరికరాలు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Krishna Sp Destroy Natu Sara 2

Krishna Sp Destroy Natu Sara 2

Also Read : Cameras in women bathroom : బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన 57 ఏళ్ల వ్యక్తి..జైలు శిక్ష వేసిన కోర్టు

ఈరోజు జరిపిన దాడిలో మొత్తం 50,000 లీటర్ల బెల్లపు వూటను గుర్తించి ధ్వంసం చేసారు. మరో 1,000 లీటర్ల నాటు సారాను కొల్లేరులో పోశారు. 2 మోటర్ ఇంజన్ పడవలు, 2 పడవలు, 15 గ్యాస్ పొయ్యిలు, బట్టి పాత్రలు 48 , ప్లాస్టిక్ డ్రమ్ములు 60, వాటర్ క్యాన్లు 40, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో నాటు సారా తయారీ పాల్పడుతున్న 4 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి పై కైకలూరు రూరల్  పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు.

Krishna Sp Destroy Natu Sara 3

Krishna Sp Destroy Natu Sara 3