గిదేం బుద్ధి : బస్సులో మహిళపై కండక్టర్ అసభ్య ప్రవర్తన

ఆడవారు ఒంటరిగా కనిపిస్తే..చాలు..రెచ్చిపోతున్నారు కామాంధులు. చూపులు, చేష్టలతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఎన్ని చట్టాలు వస్తున్నా..వీరు మాత్రం మారడం లేదు. ఎక్కడో ఒక చోట..మహిళలపై దారుణాలు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ కండక్టర్ చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మహిళా ప్రయాణీకురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. చేయి..లాగుతూ..నొక్కుతూ..కనిపించిన దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
శశిహరి షాలూర్. కర్నాటకలోని కన్నడ జిల్లా పుత్తూరు డిపోలో కండక్టరగా విధులు నిర్వహిస్తున్నాడు. పుత్తూరు నుంచి హసన్‌కు బస్సులో ఓ మహిళ ప్రయాణిస్తోంది. ఈ సమయంలో ప్రయాణీకులు ఎవరూ లేరు. అంతే..కామంతో కళ్లు మూసుకపోయాయి కండక్టర్‌కి. అమాంతం వచ్చి పక్కన కూర్చొన్నాడు. మాటలు కలిపాడు. ఇక చేతులు వేయడం ప్రారంభించాడు. వారించే ప్రయత్నం చేసినా..ఆ కండక్టర్ లైట్ తీసుకున్నాడు.
అసభ్యకరంగా తాకుతూ ప్రవర్తించాడు. ఇక లాభం లేదని అనుకుని..అతను చేస్తున్న నీచ పనిని మొత్తం సెల్ ఫోన్‌లో రికార్డు చేసింది. హసన్‌కు చేరుకున్న తర్వాత…ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. KSRTC అధికారులకు షేర్ చేశారు. వెంటనే సంస్థ యాజమాన్యం స్పందించింది. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Read More : CAA నిరసనలు : నిన్న ఢిల్లీ..నేడు చెన్నై రేపు ?