కూకట్ పల్లిలో ఘరానా దొంగ అరెస్ట్ : అద్దెకు దిగుతాడు.. ఫర్నీచర్ ఎత్తుకుపోతాడు

హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దొంగ పేరు శ్రీవాస్తవ. అతడి టార్గెట్ ఫర్నీష్డ్ ప్లాట్లే. నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలతో అద్దెకు దిగుతాడు. ఆ

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 09:52 AM IST
కూకట్ పల్లిలో ఘరానా దొంగ అరెస్ట్ : అద్దెకు దిగుతాడు.. ఫర్నీచర్ ఎత్తుకుపోతాడు

Updated On : November 20, 2019 / 9:52 AM IST

హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దొంగ పేరు శ్రీవాస్తవ. అతడి టార్గెట్ ఫర్నీష్డ్ ప్లాట్లే. నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలతో అద్దెకు దిగుతాడు. ఆ

హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దొంగ పేరు శ్రీవాస్తవ. అతడి టార్గెట్ ఫర్నీష్డ్ ప్లాట్లే. నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలతో అద్దెకు దిగుతాడు. ఆ తర్వాత అందులోని ఫర్నీచర్ ను దొంగిలించి పారిపోతాడు. వరుసగా ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీవాస్తవను పట్టుకున్నారు. అతడి నుంచి 5 టీవీలు, 8 సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, కారు స్వాధీనం చేసుకున్నారు. శ్రీవాస్తవతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా శ్రీవాస్తవ ఉన్నత చదువులు చదివాడు. ఢిల్లీ యూనివర్సిటీలో బీటెక్ చేశాడు.

బీటెక్ చదివిన శ్రీవాస్తవ.. ఈజీ మనీకి అలవాటు పడ్డాడని పోలీసులు తెలిపారు. పోష్ గా కనిపించి మోసం చేస్తున్నాడు. ఈ వెరైటీ దొంగ గురించి తెలుసుకుని పోలీసులే షాక్ అయ్యారు. కొందరు దొంగలు డబ్బు దోచుకుంటారు, కొందరు ఆభరణాలు చోరీ చేస్తారు. శ్రీవాస్తవ మాత్రం ఫర్నీచర్ ని టార్గెట్ చేస్తాడు. ఎక్కడెక్కడ ఫర్నీష్డ్ ప్లాట్లు ఉన్నాయో తెలుసుకుంటాడు. ఆ తర్వాత నకిలీ పత్రాలతో అందులో రెంట్ కి దిగుతాడు.

ఎవరికీ అనుమానం కలగకుండా పెద్ద మనిషిలా బిల్డప్ ఇస్తాడు. మంచి సమయం చూసుకుని ఇంట్లోని ఫర్నీచర్ ని, సామాన్లను చోరీ చేస్తాడు. ఒక్కొక్కటిగా అపహరిస్తాడు. ఓ రోజు.. ఎవరికీ చెప్పకుండా మాయమైపోతాడు. అతడిచ్చిన ఆధార్, అడ్రస్ ప్రూఫ్ లు అన్నీ నకిలీవి కావడంతో.. శ్రీవాస్తవ గురించి ఎవరికీ ఏమీ తెలిసేది కాదు. శ్రీవాస్తవ బాధితులు ఒక్కొక్కరిగా పోలీసుల దగ్గరికి వస్తున్నారు. తాము మోసపోయామని ప్లాట్ల ఓనర్లు ఫిర్యాదు చేస్తున్నారు.