అజ్ఞాత స్వామి సంచారం : పుణ్యక్షేత్రంలో పుర్రె,ఎముకలతో క్షుద్రపూజలు

  • Published By: veegamteam ,Published On : November 5, 2019 / 05:38 AM IST
అజ్ఞాత స్వామి సంచారం : పుణ్యక్షేత్రంలో పుర్రె,ఎముకలతో క్షుద్రపూజలు

Updated On : November 5, 2019 / 5:38 AM IST

కర్నూలు జిల్లా ఉరుకుందలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తున్నాయి. మనిషి పుర్రె, ఎముకలతో క్షుద్ర పూజలు చేస్తున్నట్లుగా గుర్తించిన స్థానికులను భయాందోళనలకు గురవుతున్నారు. దీపావళి అమావాస్య రోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వీరన్న స్వామి పుణ్య క్షేత్రంలో జరుగుతున్న ఈ క్షుద్రపూజలు ప్రజల్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి.  

పుర్రె, ఎముకల్ని చూసిన స్థానికులు ఎవరు చేస్తున్నారో..ఎందుకు చేస్తున్నారో తెలీక..పగలు ఒక ప్రాంతంలో రాత్రి మరొక ప్రాంతంలో కనిపిస్తున్న పుర్రెలు..ఎముకలి కనిపిస్తుండతో భయపడిపోతున్నారు. గుప్త నిధుల కోసం ఈ పూజలు చేస్తున్నారా? లేదా మరేమైన కారణాలున్నాయా అని అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఈరన్న ఆలయ పరిసరాల్లో ఓ అజ్ఞాత స్వామి సంచరిస్తున్నాడనే వార్తలు కూడా వస్తుండటంతో స్థానికులు అసలు ఎవరీ స్వామి? ఆయనే ఈ పూజలు చేస్తున్నాడా? లేదా ఎవరైనా చేస్తున్నారా?అనే అనుమానాలు…భయాందోళనలతో స్థానికులు సతమతమవుతున్నారు.

27,28 తేదీల్లో కర్నూలు లోని ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరిసింహస్వామి దేవాలయానికి ఈ అజ్ఞాత స్వామీజీతో కలిసి ఉరుకుంద దేవాలయం ఈవో వాణి కలిసి వెళ్ళినట్లుగా సమాచారం. సరిగ్గా పూజలు జరిగిన   దీపావళి అమావాస్య రోజున జరిగిన రోజు వీరన్న ఆలయ సిబ్బంది విధులకు హాజరు కాకపోవటంతో మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది.  
వీరన్న ఆలయానికి సమీపంలో ఉన్న భక్తుల విడిది గదిలో ఈ క్షుద్ర పూజలు జరిగాయి. ఈ పూజల్లో వినియోగించిన పుర్రెలు, ఎముకలతో పాటు  ఓ నల్ల వస్త్రం, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వంటివి చూసిన భక్తులతో పాటు స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.