Falaknuma Express: ఫలక్‭నామా ఎక్స్‭ప్రెస్ రైలు ప్రమాదం ముందుగా ప్లాన్ చేసిందా? కలకలం సృష్టిస్తున్న అగంతకుడి లేఖ

వారం రోజుల క్రితం ఒక అగంతకుడి నుంచి వచ్చిన లేఖ ఈ అనుమానాల్ని రేకెత్తిస్తోంది. అయితే పోలీసులు, రైల్వే శాఖ ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేదట.

Falaknuma Express: ఫలక్‭నామా ఎక్స్‭ప్రెస్ రైలు ప్రమాదం ముందుగా ప్లాన్ చేసిందా? కలకలం సృష్టిస్తున్న అగంతకుడి లేఖ

Falaknuma Express Fire Accident

Updated On : July 7, 2023 / 3:47 PM IST

Falaknuma Express Fire Accident: ఫలక్‭నామా ఎక్స్‭ప్రెస్ రైలు ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే ముందుగా ప్లాన్ చేసి, ఉద్దేశపూర్వకంగా చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒక అగంతకుడి నుంచి వచ్చిన లేఖ ఈ అనుమానాల్ని రేకెత్తిస్తోంది. ఆ అగంతకుడి నుంచి వారం రోజుల క్రితం వచ్చిన లేఖలో బాలాసోర్ లాంటి రైలు ప్రమాదం (Balasore train accident) తొందరలోనే జరుగుతుందని పేర్కొన్నాడు. అయితే రైల్వే శాఖ ఈ లేఖను గోప్యంగా ఉంచిందట. పోలీసులు, రైల్వే శాఖ ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేదట. ఈ నేపథ్యంలో రైలు ప్రమాదం అనుకోకుండా జరిగిందా? లేదంటే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి.

Manipur Violence: మణిపూర్ విషయంలో కలుగజేసుకుంటామన్న అమెరికా.. మీ వ్యవహారాల్లో వేలు పెట్టలేదంటూ చురకలు అంటించిన కాంగ్రెస్ నేత

తెలంగాణలోని భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఫలక్‭నామా ఎక్స్ ప్రెస్‭ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. S4, S5, S6, S7 అనే నాలుగు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. మొదట పొగ రాగానే లోకో పైలట్ గమనించి రైలుని నిలిపివేశారు. రైల్వే సిబ్భంది వెంటనే ప్రయాణికుల్ని దింపేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే కొద్ది మంది ప్రయాణికులకు మాత్రం స్వల్పకాలిక గాయాలైనట్లు తెలుస్తోంది.

Chhattisgarh: ప్రధాని సభకు వెళ్తుండగా ప్రమాదానికి గురైన బస్సు.. స్పాట్‭లోనే ముగ్గురు మృతి

ఈ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. రైల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేరవేసేందుకు రైల్వే కసరత్తులు ప్రారంభించింది. ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇక ప్రమాదం జరిగిన స్థలానికి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ మరికొద్ది సేపట్లో చేరుకోనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. రైలు ప్రమాదం కారణంగా ఆ మార్గం గుండా నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, అగ్ని ప్రమాదంపై సహాయక చర్యలపతీ రైల్వే శాఖ ముమ్మరం చేసింది. మంటల్లో చిక్కుకున్న భోగిలనుంచి మిగతా భోగి నుంచి రైల్వే రెస్క్యూ టీం విడదీసింది. నాలుగు బోగీలను అక్కడే వదిలేసి రైలును సికింద్రాబాద్ పంపించారు.

Also Read: ఫలక్‭నామా ఎక్స్‭ప్రెస్‭లో భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన రైలు బోగీలు