Chhattisgarh: ప్రధాని సభకు వెళ్తుండగా ప్రమాదానికి గురైన బస్సు.. స్పాట్లోనే ముగ్గురు మృతి
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. కాగా, ముందు వరుసల్లో కూర్చున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Bus Accident in Chhattisgarh: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్పూర్లో ఉదయం జరిగిన దారుణ ప్రమాదమిది. శుక్రవారం రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో ప్రధాని సభ ఉంది. అయితే ఈ సభకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలు వివిధ మార్గాల ద్వారా వస్తున్నారు. ఇందులో భాగంగా అంబికాపూర్ నుంచి రాయ్‌పూర్‌కు వస్తున్న ఒక బస్సు బిలాస్పూర్ సమీపంలోని బెల్తారాకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఒక టిప్పర్ లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. కాగా, ముందు వరుసల్లో కూర్చున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం బిలాస్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసు వర్గాలు వెల్లడించాయి. మిగిలిన ప్రయాణికులకు వేరే వాహనం ఏర్పాటు చేసి స్వగ్రమానికి తరలించారు.