Pak woman Seema Haider : ‘గదర్’ ప్రేమకథా చిత్రం అంటే నాకెంతో ఇష్టం…పాక్ మహిళ సీమా హైదర్ వెల్లడి

భర్తను వదిలి తన నలుగురు పిల్లలతో కలిసి భారతదేశానికి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ రోజుకొక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తన ప్రేమికుడైన సచిన్ మీనాతో జీవితం పంచుకోవడం అంటే తనకెంతో ఇష్టమని సీమా చెప్పారు....

Pak woman Seema Haider : ‘గదర్’ ప్రేమకథా చిత్రం అంటే నాకెంతో ఇష్టం…పాక్ మహిళ సీమా హైదర్ వెల్లడి

Pak woman Seema Haider

Updated On : July 14, 2023 / 8:10 AM IST

Pak woman Seema Haider : భర్తను వదిలి తన నలుగురు పిల్లలతో కలిసి భారతదేశానికి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ రోజుకొక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తన ప్రేమికుడైన సచిన్ మీనాతో జీవితం పంచుకోవడం అంటే తనకెంతో ఇష్టమని సీమా చెప్పారు. (Pak woman Seema Haider on life with Indian lover)

Seema Haider : సీమాహైదర్ ప్రేమ కథలో ముంబయి పోలీసులకు మరో హెచ్చరిక

సన్నీడియోల్, అమీషాపటేల్ నటించిన 2001 నాటి బ్లాక్ బస్టర్ ప్రేమకథాచిత్రం ‘గదర్’ అంటే తనకెంతో ఇష్టమని ఆమె చెప్పారు. దేశ విభజన అనంతరం భారత ప్రేమికుడు, పాకిస్థానీ ప్రియురాలి ప్రేమ కథ ఆధారంగా తీసిన గదర్ చిత్రం తననెంతో ఆకట్టుకుందని సీమా వివరించారు.

బెండకాయ తప్ప అన్నీ ఇష్టమే…

తన ప్రేమికుడైన భర్త సచిన్ మీనాతో కలిసి ఉండటాన్ని తాను ఇష్టపడతానని పాక్ ప్రేమికురాలు సీమా హైదర్ చెప్పారు. బంగారం రంగు చీర ధరించి నుదుట సింధూరం పెట్టుకొని మంగళసూత్రంతో కనిపించిన సీమా పలు టీవీలకు తాజాగా ఇంటర్వ్యూలిచ్చారు. తనకు బెండకాయ తప్ప అన్నీ కూరలంటే తనకు ఇష్టమని సీమా చెప్పారు. బెండకాయ తనకు అలర్జీ అని ఆమె పేర్కొన్నారు.

టీవీ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నా…

తాను గత కొన్ని రోజులుగా టీవీ, మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నానని సీమా హైదర్ చెప్పారు. తనకు సమయం లభిస్తే తన ప్రేమికుడి కుటుంబానికి వంట చేస్తానని చెప్పారు. (Seema and Sachin fell in love) తాను ప్రేమికుడితో కలిసి ఉండేందుకు భారతదేశంలోకి రావడాన్ని కొందరు నాటకమని చెబుతున్నారని, కాని అది కరెక్టు కాదన్నారు. తన ఇల్లు ఇండియానే అని ఆమె పేర్కొన్నారు.

నేను పాక్ గూఢాచారిని కాను…

తాను పాక్ గూఢాచారి అనే ఆరోపణలను సీమా కొట్టిపారేశారు. తాను గూఢాచారిణి అయితే తన అమాయక పిల్లలతో కలిసి ఎందుకు వస్తానని ఎదురు ప్రశ్నించారు. తాను ఐదవ తరగతి వరకు చదువుకున్నాని చెప్పినప్పటికి ఇంగ్లీషు మాట్లాడే నైపుణ్యం ఉందని ప్రశ్నిస్తే తాను సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఎవరైనా ఉపయోగించవచ్చని చెప్పారు. తనకు కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

భారత్ లో ఉండనివ్వండి…

తన ప్రేమికుడి కోసం భారతదేశానికి వచ్చిన తనను భారత్ ఉండనివ్వాలని సీమా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు విన్నవించింది. సీమాను పాకిస్థాన్ బహిష్కరిస్తుందని భయపడుతున్నారా అని ప్రియుడు సచిన్ మీనాను ప్రశ్నిస్తే తమకు అలాంటి భయం లేదన్నారు. తన భార్య అయిన సీమా హైదర్ కు భారత పౌరసత్వం లభిస్తుందని ఆశిస్తున్నట్లు సచిన్ చెప్పారు.

సందడి సీమా, సచిన్ ఇల్లు

సీమా హైదర్ తనకు మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. తనపై అసత్య ప్రచారం చేయవద్దని ఆమె కోరారు. సీమా నలుగురు పిల్లలతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో అద్దెకు తీసుకున్న అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్నారు. ప్రతీ నిత్యం టీవీ, మీడియా విలేఖరుల వరుస ఇంటర్వ్యూలు, సందర్శకుల రద్దీతో సీమా, సచిన్ ఇల్లు సందడిగా మారింది.