ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, స్పారియో ఢీ.. నలుగురు మృతి

నలుగురు స్పాట్ లోనే దుర్మరణం చెందారు. మృతుల్లో చిన్నారి కూడా ఉంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, స్పారియో ఢీ.. నలుగురు మృతి

Road Accident

Updated On : June 1, 2024 / 1:01 AM IST

Road Incident : తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు రక్తమోడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో కొన్ని రోజులుగా ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలోని పెట్రోల్ పంపు దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, స్కార్పియో ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి స్కార్పియో వాహనంలో ఏడు మంది హైదరాబాద్ వెళుతున్నారు. ఆ సమయంలో లారీ ఢీకొంది. నలుగురు స్పాట్ లోనే దుర్మరణం చెందారు. మృతుల్లో చిన్నారి కూడా ఉంది. ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

Also Read : ప్రేమోన్మాది ఘాతుకం.. పెళ్లికి ఒప్పుకోలేదని యువతి గొంతుకోసి హత్యచేశాడు.. ఆ తరువాత..