ప్రేమోన్మాది ఘాతుకం.. పెళ్లికి ఒప్పుకోలేదని యువతి గొంతుకోసి హత్యచేశాడు.. ఆ తరువాత..
సత్రంపాడు వినాయకుడి గుడి సమీపంలో రత్నాగ్రేసి తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి సిద్ధార్థ విద్యాసంస్థలలో పనిచేస్తుంది.

Ratna Grace and Esuratnam
Eluru District : ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదని యువతి గొంతుకోసి హత్యచేశాడు. ఆ తరువాత తాను గొంతు కోసుకొని ఆత్మహత్యా యత్నంకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లాలోని సత్రంపాడులో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : పదిలో పది సార్లు ఫెయిల్.. 11వ సారి పాసైన యువకుడు.. గ్రామంలో భారీగా ఊరేగింపు.. ఎందుకంటే?
డీఎస్పీ శ్రీనివాసులు చెప్పిన వివరాల ప్రకారం.. మృతురాలి పేరు రత్న గ్రేసీ, దాడికి పాల్పడిన వ్యక్తి యేసు రత్నం. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఏసు రత్నం యువతి ఇంటికి వెళ్లి ఆమెను బయటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై కత్తితో దాడిచేసి హత్యచేశాడు. తనుకూడా ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఏసు రత్నం పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని డీఎస్పీ చెప్పారు. అతనిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు, 304 ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
Also Read : Rafale M Fighter : సముద్ర జలాల్లో ఆధిపత్యమే టార్గెట్.. హిందూ మహాసముద్రంలో డ్రాగన్‌కు చెక్
సత్రంపాడు వినాయకుడి గుడి సమీపంలో రత్నాగ్రేసి తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి సిద్ధార్థ విద్యాసంస్థలలో పనిచేస్తుంది. ఏసు రత్నం కృష్ణాజిల్లా ముసునూరు గ్రామానికి చెందినవాడు. రత్న గ్రేసికి స్కూల్ టైం నుండే పరిచయం ఉన్నట్టుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. వీరిద్దరూ రెండు సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నారు. రత్న గ్రేసికి ఈనెల 16వ తేదీన మరో వ్యక్తితో పెళ్ళి చేసేందుకు నిశ్చయించారు. ఈనెల 26న కుటుంబ సభ్యులు నిశ్చయ తాంబూలం కూడా తీసుకున్నారు. ఏసు రత్నం గ్రేసీని ప్రేమిస్తూ వెంటపడుతున్నాడని, పెళ్లి కుదిరిందనే సరికి ఈ దారుణానికి పాల్పడినట్లు గ్రేసి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.