మహిత హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం 

  • Published By: chvmurthy ,Published On : April 28, 2019 / 04:27 PM IST
మహిత హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం 

Updated On : April 28, 2019 / 4:27 PM IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కాజగొప్పలో ఆదివారం నాడు జరిగిన మహిత అనే యువతి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలిసింది. విజయవాడకు చెందిన మహేష్ అనే వ్యక్తి హైదరాబాద్లో కారు డ్రయివర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలి కాలంలో యలమంచిలి పరిసరాల్లో జరుగుతున్న సినిమా షూటింగ్ లకు కారు డ్రయివర్ గాపని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఆ సమయంలో ఇంటర్మీడియేట్ చదివే మహిత పరిచయం అయ్యింది. ఆరు నెలలుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. తనకు పెద్దలు పెళ్లి కుదిర్చారని తనను మర్చిపొమ్మని మహిత మహేష్ కు ఇటీవల చెప్పింది. మహేష్ కు ఇప్పటికే పెళ్లయి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.

ఆదివారం మహితను కలిసిన మహేష్,  వేరే పెళ్లి చేసుకోవద్దని కోరాడు. దానికి ఆమె నిరాకరించింది. దాంతో ఆగ్రహించిన మహేష్ తన వెంట తెచ్చుకున్నకత్తితో ఆమె గొంతు కొసి హత మార్చాడు. ఘటనా స్ధలంలోనే ఆమె ప్రాణాలు విడిచాక , మహేష్ అక్కడే కూర్చుని నేనే హత్య చేశానని గట్టిగా అరిచాడు. ఇది గమనించిన స్ధానికులు అక్కడకు చేరుకుని మహేష్ ను తీవ్రంగా కొట్టటంతో అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కొందరు స్ధానికులు అతడ్ని ఆస్ప్రతిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.