సూసైడ్‌కి ముందు : కంటతడి పెట్టిస్తున్న ప్రేమికుల సెల్ఫీ వీడియో

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. అంతకంటే ముందు వీరు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో కంటతడి పెట్టిస్తోంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రగిరి మండలం మొరవపల్లెకు చెందిన ధనుంజయ్..ఓ యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి కుటుంబసభ్యులు నో చెప్పారు. దీనితో వీరు సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
Read Also : రోడ్డు ప్రమాదం: ఇద్దరు టీవీ ఆర్టిస్టులు మృతి
ముందుగా పెళ్లి చేసుకున్న వీరు..ఇదే మా చివరి సందేశం అంటూ ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం సెల్ఫీ వీడియో తీసుకున్నారు. బై..అన్న..బై..వదిన..బై..అమ్మా..బై..నాన్న..అంటూ సందేశంలో పేర్కొన్నారు. తమ చావే అందరికీ ఉదహారణ కావాలని..ఎవరూ ప్రేమించుకున్నా విడదీయవద్దని…ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. వీడియోలో చివరిసారిగా ఒకసారి నవ్వు అంటూ ప్రియురాలిని ధనుంజయ్ కోరాడు. తరువాత ఇద్దరూ కలిసి చంద్రగిరిలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వీడియో అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.
Read Also : వినూత్న వివాహం : పెళ్లంతా 100 శాతం ఓటింగ్ నినాదమే