అసలేం జరిగింది : మాజా తాగి బాబు మృతి, పాప పరిస్థితి విషమం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలం దగ్గర దొరికిన మాజా తాగి బాలుడు చనిపోయాడు. మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. మాజా

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలం దగ్గర దొరికిన మాజా తాగి బాలుడు చనిపోయాడు. మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. మాజా
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలం దగ్గర దొరికిన మాజా తాగి బాలుడు చనిపోయాడు. మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. మాజా బాటిల్‌లో విషం కలిపి ఉన్నట్టు గుర్తించారు. మాజా తాగిన నాలుగేళ్ల శివరామ్ నాయక్ మృతి చెందాడు. ఆరేళ్ల ఐశ్వర్య పరిస్థితి విషమంగా మారింది. చిన్నారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బానోతు తిరుపతి, రజిత దంపతులు చిన్నారులను తీసుకుని పొలం దగ్గరికి వెళ్లారు.
అక్కడ పిల్లలకు మాజా బాటిల్ దొరికింది. ఏమీ తెలియని పిల్లలు.. ఆ మాజా తాగారు. ఆ వెంటనే బాబు చనిపోయాడు. తిరుపతి, రజిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
ఈ ఘటన స్థానికులను షాక్ కు గురి చేసింది. అసలు మాజా బాటిల్ అక్కడికి ఎలా వచ్చింది. అందులో ఎవరు విషం కలిపారు అనేది తెలియాల్సి ఉంది. దీని గురించి పోలీసులు విచారణ చేపట్టారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేశారు. బాబు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.