Dowry Demand : వివాహితని వివస్త్రని చేసి భర్త, అత్తమామలు, ఆడబిడ్డ దాడి.. నెల్లూరు జిల్లాలో దారుణం..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. పరారీలో ఉన్న భర్త, అత్తమామల కోసం గాలిస్తున్నారు.

Dowry Demand : వివాహితని వివస్త్రని చేసి భర్త, అత్తమామలు, ఆడబిడ్డ దాడి.. నెల్లూరు జిల్లాలో దారుణం..

Updated On : April 10, 2025 / 4:57 PM IST

Dowry Demand : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడబిడ్డ బరితెగించారు. వివాహిత పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. వివాహితను వివస్త్రని చేసి ఆమెపై దాడి చేశారు. విషయం బయటకొస్తుందని ఆపై ఆమెను కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందంటూ హైడ్రామా ఆడారు.

Also Read : ఏపీలో వెట్టిచాకిరి కలకలం.. 15 ఏళ్లుగా కేవలం తినడానికి తిండి పెట్టి.. ఒక ఓనర్ నుంచి మరో ఓనర్ కి అమ్మి..

నెల్లూరు జిల్లా ఊటుకూరు పెద్ద పట్టపుపాలెంలో ఈ ఘోరం జరిగింది. వివాహిత సుగుణమ్మ మృతదేహం నెల్లూరు GGH కి తరలించారు. భర్త హరికృష్ణ, అత్తమామలు నాగూర్, నర్సమ్మ, ఆడబిడ్డ నాగలక్ష్మీ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాసరావు స్వయంగా విచారణ చేపట్టారు.