మద్యం మత్తులో స్నేహితుడి గొంతుకోసి చంపేశాడు

హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో వ్యక్తి దారుణ హత్యకు గావించబడ్డాడు. స్నేహితుడు అతని గొంతుకోసి హత్య చేశాడు.

  • Published By: veegamteam ,Published On : March 13, 2020 / 02:25 AM IST
మద్యం మత్తులో స్నేహితుడి గొంతుకోసి చంపేశాడు

Updated On : March 13, 2020 / 2:25 AM IST

హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో వ్యక్తి దారుణ హత్యకు గావించబడ్డాడు. స్నేహితుడు అతని గొంతుకోసి హత్య చేశాడు.

హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో వ్యక్తి దారుణ హత్యకు గావించబడ్డాడు. స్నేహితుడే అతని గొంతుకోసి హత్య చేశాడు. అబ్బు, మోసిన్ అనే ఇద్దరు వ్యక్తులు స్నేహితులు. ఇద్దరు స్నేహితులు మద్యం తాగారు. అయితే మద్యం మత్తులో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. కోపంతో అబ్బు అనే వ్యక్తి..మోసిన్ అనే వ్యక్తిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా గొంతుకోసి హత్య చేశాడు. 

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు అబ్బును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.  

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్య ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతుని కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షంచాలని డిమాండ్ చేస్తున్నారు. 

See Also | ఉద్యోగికి కరోనా: నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్ మూసివేత